‘ గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేష్ ‘ క్లోజింగ్ క‌లెక్ష‌న్స్‌

Google+ Pinterest LinkedIn Tumblr +

మెగా ప్రిన్స్ వ‌రుణ్‌తేజ్ హీరోగా న‌టించిన గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేష్ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఫైన‌ల్ ర‌న్ కంప్లీట్ చేసుకుంది. ఇప్ప‌టికే సంక్రాంతికి వ‌చ్చిన ఎఫ్ 2 లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ త‌ర్వాత మ‌రో క్లాసిక్ హిట్‌ను త‌న ఖాతాలో వేసుకున్నాడు. తమిళ బ్లాక్ బస్టర్ చిత్రం జిగర్తాండకు రీమేక్‌గా తెర‌కెక్కిన‌ ఈ మాస్ ఎంటర్టైనర్లో అధర్వ మురళి, పూజా హెగ్డే మరియు మృనాలిని రవి ఇతర కీలక పాత్రలు పోషించారు. 14 రీల్స్ బ్యాన‌ర్‌పై తెర‌కెక్కిన ఈ సినిమాకు మిక్కీ జె మేయర్ సంగీతం సమకూర్చారు.

ఈ సినిమాకు వ‌చ్చిన టాక్‌తో పోలిస్తే బాక్సాఫీస్ ద‌గ్గ‌ర మ‌రిన్ని వ‌సూళ్లు రాబ‌ట్టాల్సి ఉంది. అయితే హైద‌రాబాద్‌లో ఈ సినిమా రిలీజ్ అయిన తొలి వారం రోజులు భారీ వ‌ర్షాలు కుర‌వ‌డంతో సినిమాకు అనుకున్న రేంజ్‌లో వ‌సూళ్లు రాలేదు. ఇక ఈ సినిమా ఫైన‌ల్ వ‌సూళ్లు, ప్రి రిలీజ్ బిజినెస్‌తో కంపేరిజ‌న్ చేస్తే అన్ని ఏరియాల్లోనూ బ‌య్య‌ర్లు సేఫ్ అయ్యారు. ఏరియాల వారీగా ఈ సినిమా వ‌సూళ్లు ఇలా ఉన్నాయి.

గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేష్ క్లోజింగ్ క‌లెక్ష‌న్స్ (రూ.కోట్ల‌లో) :

నైజాం – 8.74

సీడెడ్ – 3.45

ఉత్త‌రాంధ్ర – 2.66

ఈస్ట్ – 1.61

వెస్ట్ – 1.51

కృష్ణా – 1.42

గుంటూరు – 1.83

నెల్లూరు – 0.89
————————————–
ఏపీ + తెలంగాణ = 22.11 కోట్లు
————————————–

రెస్టాఫ్ ఇండియా – 1.96

రెస్టాఫ్ వ‌ర‌ల్డ్ – 1.08
———————————————–
టోట‌ల్ వ‌ర‌ల్డ్ వైడ్ షేర్ = 25.15 కోట్లు
———————————————–

Share.