రాజ‌మౌళి – మ‌హేష్ మూవీ క‌థ ఇదే..

Google+ Pinterest LinkedIn Tumblr +

టాలీవుడ్ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న అతిపెద్ద కాంబినేషన్ మహేష్-రాజమౌళి. ఈ ఇద్ద‌రి కాంబినేష‌న్‌లో సినిమా కోసం దాదాపుగా 15 ఏళ్ల నుంచి అటు మహేష్ అభిమానులతో పాటు, సగటు సినీ అభిమానులు ఎప్పటినుండో ఎదురు చూస్తున్నారు. టాప్ హీరోల బెస్ట్ ఛాయిస్ గా ఉన్న రాజమౌళి ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్‌, ప్ర‌భాస్‌, సునీల్‌, నాని, ర‌వితేజ‌, నితిన్ లాంటి వాళ్ల‌తో సినిమాలు చేశారు. రాజ‌మౌళి ఇప్ప‌టి వ‌ర‌కు త‌న కెరీర్‌లో కేవ‌లం 12 సినిమాలు మాత్ర‌మే చేశారు. అందులో ప్ర‌భాస్‌తో 3, ఎన్టీఆర్‌తో మూడు సినిమాలు ఉన్నాయి.

టాలీవుడ్ టాప్ స్టార్స్ అయిన మహేష్, పవన్ కళ్యాణ్ లతో రాజ‌మౌళి ఇప్ప‌టి వ‌ర‌కు సినిమాలు చేయ‌లేదు. ఈ ఇద్ద‌రు హీరోల‌తో రాజ‌మౌళి సినిమా చేయాల‌ని ప్ర‌తి ఒక్క‌రు కోరుకుంటున్నారు. ఇక రాజ‌మౌళి ప్ర‌స్తుతం రామ్‌చ‌ర‌ణ్ – ఎన్టీఆర్‌తో అదిరిపోయే మ‌ల్టీస్టార‌ర్ సినిమా తెర‌కెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే. రాజ‌మౌళి తీస్తోన్న ఆర్ ఆర్ ఆర్ తరువాత రాజమౌళి చేయబోయేది మహేష్ తోనే అని ఒక రూమర్ కొద్దిరోజులుగా పరిశ్రమలో చక్కర్లు కొడుతుంది.

ఇక ఈ సినిమా స్టోరీ లైన్ కూడా ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. రాజ‌మౌళి మ‌హేష్ సినిమాను జేమ్స్ బాండ్ తరహా నేపథ్యంలో తెరకెక్కించనున్నాడని వార్త. దుర్గా ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై డాక్ట‌ర్ కేఎల్‌.నారాయ‌ణ ఈ సినిమాను నిర్మించ‌నున్నాడ‌ని తెలుస్తోంది. రాజ‌మౌళికి ఈ సినిమా విష‌య‌మై కేఎల్‌.నారాయ‌ణ ఎప్పుడో అడ్వాన్స్‌లు కూడా ఇచ్చేశారు.

Share.