భారత్ లోకి ఉబర్ ఫ్లాయింగ్ క్యాబ్స్

Google+ Pinterest LinkedIn Tumblr +

అవును మీరు విన్నది నిజమే, మరి కొన్ని ఏళ్లలో భారత్ లోకి ఫ్లైయింగ్ క్యాబ్స్ రానున్నాయ్. ఈ రోజు టోక్యో నగరం లో జరిగిన ” ఉబర్ ఎలివేట్ ఆసియా పసిఫిక్ ఎక్సపో ” లో ఉబర్ స్వయంగా ఈ విషయాన్నీ స్పష్టం చేసింది. మేము ప్రపంచ దేశాలన్నిటిని పరిశీలించాం అందులో నుండి జపాన్, ఇండియా, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, బ్రెజిల్ దేశాలని ఈ ప్రాజెక్ట్ లాంచ్ చేయటానికి ఎన్నుకున్నామని వారు తెలిపారు. ఈ 5 దేశాల్లో మొదటగా ఒక దేశం లో త్వరలో మా సంస్థ ఫ్లైయింగ్ టాక్సిస్ రూపకల్పన ప్రారంభించబోతుంది. ఇప్పటికే మేము యు ఎస్ ఏ లోని డల్లాస్, లాస్ ఏంజెల్స్ నగరాల్లో ఈ ప్రాజెక్ట్ ప్రారంభించామని వారు తెలిపారు.

ఉబర్ కంపెనీ ప్రతినిధులు మాట్లాడుతూ ఢిల్లీ, ముంబై, బెంగళూరు వంటి నగరాల్లో కిలోమీటర్ ప్రయాణానికి కూడా చాల సమయం పడుతుందని, అటువంటి సమయాల్లో మా ఫ్లైయింగ్ క్యాబ్స్ ప్రయాణికులకు ఎంతో ఉపయోగ పడతాయని వారు వెల్లడించారు.

ఈ రోజు జరిగిన ” ఉబర్ ఎలివేట్ ఆసియా పసిఫిక్ ఎక్సపో ” లో ఎరిక్ అల్లిసిన్ ( హెడ్ – ఉబర్ ఏవియేషన్ ప్రోగ్రాం ) మాట్లాడుతూ త్వరలో ఈ దేశాల్లో ఒక దేశం లో ఈ నూతన సదుపాయం ప్రారంభించబోతున్నామని, మా ఫ్లైయింగ్ క్యాబ్స్ మా సంస్థ, మరియు మా టెక్నాలజీ కి చాల పేరు తీసుకు వస్తుందని ఆశిస్తున్నాము. వచ్చే ఐదు ఏళ్లలో ప్రయాణికులకు ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకు వస్తాం అని తెలిపారు.

ఈ ఫ్లైయింగ్ కార్స్ వలన ట్రాఫిక్ సమస్యలు తగ్గటమే కాకుండా, ప్రతి దేశాన్ని సందర్శించటానికి వచ్చిన పర్యాటకులకు కూడా ఎంతో ఉపయోగ పడతాయి, ప్రకృతి విపత్తులు సంభవించిన సమయం లో బాధితుల్ని తక్షణం రక్షించటానికి మా ఈ ఫ్లైయింగ్ కార్స్ ముఖ్య పాత్ర పోషించనున్నాయి అని వెల్లడించారు.

Share.