అల్లు అర్జున్, నాని డ్యాన్స్ వీడియో హాల్ చల్

Google+ Pinterest LinkedIn Tumblr +

టాలీవుడ్ యువ కథానాయకులు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, నేచురల్ స్టార్ నాని కి సంబంధించిన డ్యాన్స్ వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియా లో హాల్ చల్ చేస్తుంది. వీరిద్దరూ తమ బెస్ట్ ఫ్రెండ్ వెడ్డింగ్ లో ఈ విధంగా డ్యాన్స్ చేసినట్టు సమాచారం. మాములుగా మనం క్లోజ్ ఫ్రెండ్స్ వెడ్డింగ్ అనగానే ఎటువంటి డ్రెస్ వేసుకోవాలి, ఎలా రెడీ అవ్వాలి అని కొన్ని నెలల ముందు నుండే ప్రిపేర్ అవుతూ ఉంటాం, ఇక పెళ్లి రోజు మనం చేసే హడావిడి అంత ఇంత కాదు. ఇక అచ్చు సామాన్య జనం లాగే, అల్లు అర్జున్, నాని కూడా తమ ప్రియతమ స్నేహితుడి పెళ్లి లో సరదాగా పాటలు పాడి, డ్యాన్స్ చేసి అందరిని ఆకట్టుకున్నారు.

ఇక ఈ వేడుక బ్యాంగ్ కాక్ నగరంలో జరిగినట్టు తెలుస్తుంది. తెలుగులో స్టార్ హీరోలందరూ ఇలా కలిసి మెలిసి స్నేహంగా ఉండటం ఇండస్ట్రీ కే కాకుండా వారిని వెర్రిగా అభిమానించే ఫ్యాన్స్ కి కూడా ఇది ఒక చక్కటి పాజిటివ్ సందేశాన్ని ఇస్తుంది.

Share.