బాలయ్యకు ఆ కోరిక ఎప్పుడు తీరుతుందో…?

Google+ Pinterest LinkedIn Tumblr +

నందమూరి బాలకృష్ణ హీరోగా… కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో వచ్చిన సినిమా రూలర్. ఈ సినిమా నేడు విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. తన నుంచి అభిమానులు ఎం కోరుకుంటారో బాలకృష్ణ అది ఇచ్చే ప్రయత్నం చేసారు. సినిమాలో డైలాగులు, బాలయ్య నటన ప్రతీ ఒక్కటి కూడా అభిమానులను ఆకట్టుకున్నాయి. కథ లో పట్టు లేకపోయినా బాలకృష్ణ తన ఇమేజ్ తో సినిమాను నెట్టుకొచ్చారు అనే చెప్పాలి. డాన్స్ లో కుర్ర హీరోలతో బాలకృష్ణ పోటీ పడినట్టే కనిపించింది.

ఇక ఇదిలా ఉంటే బాలకృష్ణకు కొన్ని కోరికలు అలాగే మిగిలిపోయాయట… నందమూరి హీరోలు అందరు కలిసి ఒక సినిమా చేయడం, అది కూడా రైతు సినిమా చెయ్యాలని ఆయన భావించారట. ఈ విషయాన్ని బాలకృష్ణ ప్రతీ ఆడియో కార్యక్రమంలో, మీడియా తో మాట్లాడినప్పుడు చెప్తూనే ఉంటారు. ముందు ఈ సినిమాను తన సోదరుడు హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, తారక రత్నతో కలిసి చెయ్యాలని ఆయన భావించారట. గత ఏడాది కూడా ఈ సినిమా గురించి బాలకృష్ణ ఒక దర్శకుడితో చర్చలు కూడా జరిపినట్టు సమాచారం.

అయితే అనూహ్యంగా హరికృష్ణ మరణించడంతో బాలకృష్ణ ఈ సినిమా విషయంలో వెనక్కు తగ్గినట్టు తెలుస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఆయన ఈ సినిమా ప్రయత్నాలను చేస్తున్నారట. కృష్ణ వంశీ లేదా వీవి వినాయక్ తో ఈ సినిమాను బాలకృష్ణ ప్లాన్ చేసే ఆలోచనలో ఉన్నారట. ఒక ప్రాజెక్ట్ కథను ఆధారంగా చేసుకుని రైతు సినిమాను రూపొందించాలని, అందులో నందమూరి హీరోలు అందరూ కాసేపు అయినా కనపడాలని బాలకృష్ణ భావిస్తున్నారట. మరి ఆయన కోరిక ఎప్పుడు తీరుతుందో చూడాలి.

Share.