నిర్మాతపై రామ్ చరణ్ సీరియస్…!

Google+ Pinterest LinkedIn Tumblr +

రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఆర్ ఆర్ ఆర్ అనే సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ కూడా జరుపుకుంటుంది. వచ్చే ఏడాది ఎలా అయినా సరే ఈ సినిమాను విడుదల చెయ్యాలని దర్శక నిర్మాతలు పట్టుదలగా ఉన్నారు. అందుకే రాజమౌళి ఏ బ్రేక్ లేకుండా సినిమాను పూర్తి చేసే ఆలోచనలో ఉన్నాడు అనే ప్రచారం ఎక్కువగా జరుగుతుంది. ఇక తారక్ కూడా ఈ సినిమా కోసం ఎక్కువగానే కష్టపడుతున్నాడు.

రామ్ చరణ్ విషయానికి వస్తే ఇతర సినిమాలకు సంబంధించి ఆఫర్లు వచ్చినా సరే రామ్ చరణ్ మాత్రం స్పందించడం లేదని తెలుస్తుంది. ఇటీవల ఒక ప్రముఖ దర్శకుడు తాను హైదరాబాద్ లో ఉన్న సమయంలో వచ్చి కథ వినిపించే ప్రయత్నం చేయగా… వద్దని చెప్పారట. రామ్ చరణ్ కోసమే రూపొందించిన పాత్ర అది అని… యాక్షన్ కథ, మాఫియా చుట్టూ తిరుగుతుందని చెప్పారట. దీనికి రామ్ చరణ్ అంగీకరించలేదట. ఈ సినిమా అయిన తర్వాత చేస్తాను అని చెప్పగా… ఆ దర్శకుడు వచ్చే ఏడాది తర్వాత రెండేళ్ళు బిజీ గా ఉండటం తో,

తన సన్నిహిత నిర్మాత ద్వారా కూడా ట్రై చేసారని సమాచార౦. దీనితో ఆ నిర్మాత చెర్రీ తో మాట్లాడటానికి, ముందు అల్లు అరవింద్ ని సంప్రదించారట. ఆ తర్వాత చిరంజీవి కి చెప్పడంతో… చిరంజీవి రామ్ చరణ్ కి ఫోన్ చేయగా… చెర్రీ నిర్మాత మీద సీరియస్ అయ్యారట. తనతో మాట్లాడొచ్చు కదా అరవింద్ చెప్తే చేస్తానా…? ఇప్పట్లో చేయలేను అని చెప్పేశాడట. గత కొంత కాలంగా అల్లు అరవింద్ కి, రామ్ చరణ్ కి మధ్య విభేదాలు ఉన్నాయనే ప్రచారం ఎక్కువగానే జరుగుతూ వస్తుంది. దీనితోనే నిర్మాత మీద ఆగ్రహం వ్యక్తం చేసాడట.

Share.