బాలయ్య ఫాన్స్‌కి బ్యాడ్ న్యూస్…!

Google+ Pinterest LinkedIn Tumblr +

వరుస సినిమాలు చేస్తూ యువ హీరోలకు కూడా అందకుండా దూసుకుపోతున్నాడు నందమూరి నట సింహం బాలకృష్ణ. అటు రాజకీయాలను ఇటు సేవా కార్యక్రమాలను, మరో పక్క సినిమాలను మ్యానేజ్ చేస్తూ దూసుకుపోతున్నాడు. వరుసగా సినిమాలు చేయడంతో దర్శక నిర్మాతలు కూడా బాలకృష్ణ తో సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. సినిమా హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ తన మార్క్ ని చూపిస్తూ అభిమానులను సంతోష పెడుతున్నాడు.

అయితే ఏడాది పాటు బాలకృష్ణ సినిమాలకు దూరం అయ్యే అవకాశం ఉందని టాలివుడ్ వర్గాలు అంటున్నాయి. తన కుమారుడి కోసం బాలకృష్ణ అమెరికా వెళ్తున్నారని సమాచార౦. 2021 కి సినిమాల్లోకి తన కుమారుడు మోక్షజ్ఞ ను తీసుకురావాలని ప్రయత్నాలు చేస్తున్న బాలకృష్ణ… ప్రత్యేక శిక్షణ ఇప్పించడానికి అమెరికా తీసుకువెళ్తారని సమాచార౦. ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో చేస్తున్న సినిమా పూర్తి కాగానే బాలయ్య అమెరికా వెళ్లిపోతారని టాలివుడ్ వర్గాలు అంటున్నాయి.

కొన్ని రోజుల క్రితం బాలకృష్ణ తన కుమారుడు సినిమాల మీద ఆసక్తి చూపిస్తున్నారని చెప్పిన సంగతి తెలిసిందే. త్వరలోనే రంగ ప్రవేశం ఉంటుందని కూడా చెప్పారు. ఈ నేపధ్యంలోనే తాను 2023 లో సినిమాల నుంచి తప్పుకుంటే తన కుమారుడుతో ఆ లోటు ని భర్తీ చెయ్యాలని బాలకృష్ణ పట్టుదలగా ఉన్నారు. వచ్చే ఏడాది మే తర్వాత బాలకృష్ణ వెళ్ళే అవకాశం ఉందని సమాచారం. దాదాపు ఏడాది పాటు ఆయన అమెరికాలోనే ఉండే అవకాశం ఉందని టాలివుడ్ వర్గాల నుంచి వార్తలు వస్తున్నాయి.

Share.