బాలీవుడ్లో కండల వీరుడు సల్మాన్ ఖాన్ తో ఆడిపాడిన భామ ఇప్పుడు సాహోతో ఆడిపాడేందుకు సై అంటుంది. బాలీవుడ్లో కండల వీరుడితో సయ్యాటలాడిన ఈ భామేంటి టాలీవుడ్ యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్‌తో చిందులేయడం ఏంటనే కదా మీ అనుమానం. ఓసారి లుక్కెద్దాం…
యువీ క్రియోషన్ లో సాహో సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఆగస్టు 15న విడుదల చేసేందుకు సన్నహాలు జోరందుకున్నాయి. అందులో భాగంగా సాహో చిత్రంలో కొన్ని పాటల చిత్రికరణ మిగిలింది. దీంతో ఇప్పుడు పాటల చిత్రికరణ కోసం విదేశాల బాట పట్టారు చిత్ర యూనిట్. ప్రభాస్, శ్రద్దా కపూర్‌పై ఓపాటను ఆస్ట్రియాలోని సుందరమైన ప్రదేశాలల్లో చిత్రీకరణ జరుపుతున్నారు.
ఈ పాట చిత్రికరణ పూర్తి కాగానే ఈ సినిమాలో ఓ ఐటమ్ సాంగ్‌ను చిత్రికరించనున్నారు. బాహుబలి సినిమాలో ఓ మాస్ మసాలా సాంగ్‌ను కూడా చేసిన విధంగానే సాహో సినిమాలోను మసాలా సాంగ్ ఉండేలా ప్రభాస్ జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. అయితే సాహో సినిమాకు మరింత క్రేజీ తీసుకురావడానికి బాలీవుడ్లో కండలవీరుడు సల్మాన్‌ఖాన్ కు జంటగా కిక్ సినిమాలో నటించిన జాక్వెలిన్ తో ఈ మసాల సాంగ్‌ను చేయిస్తున్నారట. ఈ సాంగ్‌ను క్రొయోషియాలో చిత్రికరించేందుకు ప్రణాళికలు చేస్తున్నారట. సో మాస్ మసాల సాంగ్‌కు బాలీవుడ్ బామతో సాహో చిందులేయనుండటంతో ప్రభాస్ అభిమానులకు పండుగే పండుగ.