అల్లు అరవింద్ ను అవమానపరచిన మెగా ఫ్యాన్స్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

మెగాస్టార్ చిరంజీవి నటించిన సైర నరసింహా రెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం సాయంత్రం హైదరాబాద్ ఎల్బి స్టేడియంలో మెగా ఫ్యాన్స్ హంగామా మధ్య అంగరంగ వైభవంగా జరిగింది. ఈ ఈవెంట్ కు విశిష్ట అతిథులుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకధీరుడు రాజమౌళి అటెండ్ అయ్యారు. ఈవెంట్ లో భాగంగా అందరు మాట్లాడుతుంటే సైలెంట్ గా విన్న మెగా ఫ్యాన్స్ మెగా నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతుంటే మాత్రం కాస్త ఇబ్బంది పెట్టారు.

అల్లు అరవింద్ మైక్ అందుకోగానే వద్దు వద్దు అంటూ చేతులు అడ్డంగా ఊపారు. అయినా సరే తాను చెప్పాలనుకున్న పాయింట్ చెబుతా అంటూ చిత్రయూనిట్ కాకుండా సినిమా చూసిన మొదటి ప్రేక్షకుడిని నేనే.. సినిమా చూసి చేతిలో ఉన్నది వదిలేసి కింద పడిపోయా అంత గొప్పగా ఉంది సినిమా. తప్పకుండా సినిమా గొప్ప విజయాన్ని అందుకుంటుందని అన్నారు అల్లు అరవింద్.

అరవింద్ మాట్లాడుతున్నంత సేపు కూడా కొందరు ఫ్యాన్స్ చేతులు అడ్డంగా వద్దంటూ ఊపసాగారు. మరి మెగా ఫ్యాన్స్ ఎందుకు అల్లు ఫ్యామిలీ మీద అంత కక్ష్య కట్టిందో తెలియదు కాని పైకి చెప్పకున్నా అరవింద్ లోపల ఫ్యాన్స్ చేసిన పనికి హర్ట్ అయ్యారని చెప్పొచ్చు. అక్టోబర్ 2న సైరా రిలీజ్ అవుతుంది. తెలుగు, తమిళ, హింది, కన్నడ, మళయాళ భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది.

Share.