వైఎస్ఆర్ ‘యాత్ర’ టీజర్

Google+ Pinterest LinkedIn Tumblr +

వై ఎస్ ఆర్ ఆర్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన తాజా చిత్రం ‘యాత్ర’, ప్రముఖ నటుడు మమ్ముట్టి ఇందులో ‘వై ఎస్ ఆర్’ పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. మహి రాఘవ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. 2009 లో అధికారం లోకి రావటానికి వై ఎస్ చేసిన పాదయత్రని ఈ చిత్రంలో ప్రధానంగా చూపించనున్నారని సమాచారం, టైటిల్ ని కూడా అదే విధంగా పెట్టారని తెలుస్తుంది. 70 ఎం ఎం ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై విజయ్ చల్ల, శశి దేవిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సందర్భంగా ఈ చిత్ర టీజర్ ను చిత్ర బృందం అధికారికంగా విడుదల చేసారు. మమ్ముట్టి వై ఎస్ ఆర్ పాత్రలో ఒదిగి పోయారని చెప్పాలి. అక్టోబర్ నెలలో ఈ బయోపిక్ ని విడుదల చేయటానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుందని సమాచారం.

Share.