మాస్‌రాజా రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘అమర్ అక్బర్ ఆంథోని’ సందడి మొదలయ్యింది. తాజాగా ఈ చిత్ర టీజర్ రిలీజ్ అయ్యి ప్రేక్షకులను భీబత్సంగా అలరిస్తోన్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాను నవంబర్ 16న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించింది. అయితే రవితేజతో తాడోపేడో తేల్చుకోవడానికి రెడీ అవుతున్నాడో యంగ్ హీరో.
అర్జున్ రెడ్డి, గీతా గోవిందం వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలతో టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోగా మారిన విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ మూవీ ట్యాక్సీవాలా. ఈ సినిమా ఎప్పుడో పూర్తయినా కూడా రిలీజ్ పరంగా చాలా ఆలస్యం అవుతూ వస్తోంది. అయితే ఈసారి ఎలాగైనా ఈ సినిమాను రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యాడు మన అర్జున్ రెడ్డి. అందుకే నవంబర్ 16న ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చారు.
దీంతో బాక్సాఫీస్ వద్ద మరో యుద్ధం రెడీ అయ్యిందని అంటున్నారు సినీ క్రిటిక్స్. నోటాతో ఫెయిల్యూర్ మూటగట్టుకున్న విజయ్ ఈ సినిమాతో తన సక్సెస్ ట్రాక్‌ను కంటిన్యూ చేయాలని చేస్తోండగా మాస్ రాజా మాత్రం ఫుల్ కాన్ఫిడెంట్‌తో ‘రిలాక్స్’ అంటూ వస్తున్నాడు. మరి ఈ బాక్సాఫీస్ ఫైట్‌లో ఎవరు గెలుస్తారో చూడాలి.