వావ్:పుష్ప టీంకి..సుకుమార్ అదిరిపోయే ఆఫర్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

టాలీవుడ్ లో మోస్ట్ టాలెంటెడ్, ఇంటిలిజెంట్ ఫిలిం మేకర్ డైరెక్టర్లలో సుకుమార్ కూడా ఒకరు. తన మొదటి సినిమా నుంచి ఇప్పటి వరకు.. ఎన్నో విభిన్నమైన టేకింగ్ లతో సినిమాని ప్రజెంట్ చేయడం జరిగింది. కేవలం తన మార్పుతోనే సినిమాలు ప్రెజెంట్ చేస్తూ మెప్పిస్తూ ఉంటాడు సుకుమార్. తాజాగా పుష్ప సినిమాకు ఎంతో కష్టపడి సినిమాను తెరకెక్కించాడు సుకుమార్. అయితే తనదైన శైలిలో సినిమాలు తీసి సుకుమార్ లో కాస్త సేవా భావం కూడా కలిగి ఉందని చెప్పవచ్చు.

గతంలో కూడా కరోనా సమయంలో తన వంతు సహాయం చేశాడు సుకుమార్. ఇప్పుడు సుకుమార్ తన ఉదారతను చాటుకున్నారు. పుష్ప పార్ట్-1 కి సంబంధించి కష్టపడ్డ చిన్న ప్రతి టెక్నీషియన్, లైట్ బాయ్ నుంచి అందరికీ కూడా తనవంతు సహాయంగా ఒక లక్ష రూపాయలను ప్రతి ఒక్కరికి అందిస్తున్నట్టుగా ఈ రోజున పుష్ప సినిమా సక్సెస్ మీట్ లో తెలియజేశారు. ఇలా తెలియజేయడం వల్ల సుకుమార్ ఒక మెట్టు పైకి ఎదిగారని చెప్పవచ్చు. దీంతో ఆ చిత్ర యూనిట్ సభ్యులు అందరూ ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Share.