వామ్మో:అనసూయ పరభాషలో కూడా తన సత్తా చూపిస్తుందిగా..!

Google+ Pinterest LinkedIn Tumblr +

యాంకర్ అనసూయ కెరియర్ పరంగా హీరోయిన్ లతో సమానంగా బాగా దూసుకుపోతోంది. బుల్లితెర పైనే కాకుండా వెండితెరపై కూడా తన హవాని కొనసాగిస్తూ మంచి ఆఫర్లను కొట్టేస్తోంది. ఇటీవల వచ్చిన పుష్ప సినిమాలో.. దాక్షాయని పాత్రల్లో కూడా నటించి మెప్పించింది.. అయితే ఇప్పుడు తమిళ, మలయాళం, హిందీ వంటి భాషలలో కూడా సినిమాలు చేసేందుకు అంగీకరిస్తోంది అనసూయ. గతంలో కూడా మమ్ముట్టి సినిమా ద్వారా కేరళ ప్రేక్షకులను పలకరించ పోతున్నాను అన్నట్లుగా తెలియజేసింది అనసూయ. అందుకు సంబంధించి ఎటువంటి విశేషాలను మాత్రం బయటపెట్టలేదు.

అయితే తాజాగా అనసూయ తన పాత్ర పేరు, క్యారెక్టర్, అందుకు సంబంధించిన లుక్ ను అప్డేట్ విడుదల చేశారు. తనని పరిచయం చేసిన అమల్ నిధ్ సర్, మూర్తి సార్ లకు థ్యాంక్స్ తెలియజేసింది అనసూయ. మలయాళంలో కూడా ఇలా పరిచయం అవుతానని ఎప్పుడూ కలగనలేద.. అంతకంటే మంచి అవకాశం దొరికిందని అనసూయ చెప్పుకొచ్చింది. ప్రస్తుత ఈమె పోస్టర్ కాస్త వైరల్ గా మారుతోంది

Share.