బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమిర్ ఖాన్ తదుపరి చిత్రం `మహాభారతం 3డి`అని కొంత కాలంగా నేషనల్ మీడియా లో వార్తలు ప్రచారం అవుతున్నాయ్. ఇక ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన మరో వార్త టాలీవుడ్ లో కూడా చెక్కర్లు కొడుతుంది. అదే `మహాభారతం 3డి` లో ప్రభాస్ కూడా ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నారని టాక్. అంబానీతో కలిసి దాదాపు 1000 కోట్ల బడ్జెట్తో ఈ చిత్రాన్ని నిర్మించేందుకు అమిర్ సన్నాహాలు చేస్తున్నాడు. మూడు నుంచి ఐదు పార్ట్శ్ గా ఈ సినిమాని తెరకెక్కిస్తాడట అమిర్.
ఈ సినిమాలో నటించే కాస్టింగ్ విషయం పై కూడా ఏ మాత్రం తగ్గటం లేదట అమిర్, ఇప్పటికే సల్మాన్ ఖాన్, బిగ్ బీ అమితాబ్ ని ఈ సినిమాలో నటించమని అడిగారట. దీపికా పదుకొనె ని ద్రౌపది పాత్రలో మనం చూడవచ్చు, ఇదే నిజమైతే అమిర్ కృష్ణుడి పాత్ర లో నటించవచ్చు. ఇక బాహుబలి ప్రభాస్ ని అర్జునుడు పాత్రని చేయమని అమిర్ సంప్రదించారని కొన్ని బాలీవుడ్ వెబ్ చానెల్స్ ప్రచారం చేసాయి. అయితే ప్రభాస్ పర్సనాలిటీ రీత్యా తనకి మంచి ప్రతినాయక పాత్ర ఇస్తే ఎలా ఉంటుందో అని అమిర్ ఖాన్ ఆలోచనలో ఉన్నారని సమాచారం. ఇదే నిజమైతే వీరి మధ్య పోరు ఆసక్తికరంగా ఉండనుంది.