టాలీవుడ్ లేడి అమితాబ్ అత్తగా వెండితెరపై రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారనే వార్త తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాఫిక్గా మారింది. ఇంతకు లేడి అమితాబ్ అంటే ఎవరో కాదండి మన విజయశాంతి గారే. తెలుగు చిత్రసీమలో అగ్ర హీరోయిన్లలో విజయశాంతి ఒకరు. తెలుగు పరిశ్రమకు దొరికిన అణిముత్యాల్లో విజయశాంతికి అగ్రతాంబూలం దక్కుతుంది. అలాంటి విజయశాంతి ఇప్పుడు ప్రిన్స్ మహేష్ బాబుకు అత్తగా నటించబోతున్నారు. ప్రిన్స్ మహేష్ బాబు 26 చిత్రంలో విజయశాంతి అత్తగా నటించబోవడం సిని ఇండస్ట్రీలో పెద్ద చర్చనీయాంశంగా మారింది.
విజయశాంతి 1979లో సిని రంగ ప్రవేశం చేశారు. 180కి పైగా సినిమాల్లో తన నటనతో సిని జనాలను అలరించారు. తన నటనతో ఎన్నో అభాల గోపాలాన్ని మెప్పించారు. మేగాస్టార్ చిరంజీవికి జంటగా అనేక హిట్ చిత్రాల్లో నటించి హిట్ పేయిర్గా టాలీవుడ్లో పేరుంది. అదే విధంగా బాలకృష్ణతోను అనేక విజయవంతమైన చిత్రాల్లో నటించింది విజయశాంతి. హీరో ఓరియెంటెడ్ చిత్రాల్లోను నటించి విజయశాంతి తనకు తానే సాటిగా నిరూపించుకున్నారు. ప్రతిఘటన, కర్తవ్యం, ఓసేయ్ రాములమ్మ వంటి చిత్రాల్లో నటించి తెలుగు చిత్రసీమకే వన్నేతెచ్చింది. తన నటనతో సిన రంగాన్నే ఏలిన విజయశాంతి 12 ఏళ్ళ క్రితం సినిరంగానికి గుడ్బై చెప్పి రాజకీయాల్లో చేరారు.
లేడి అమితాబ్ విజయశాంతి చిత్రసీమ నుండి రాజకీయ రంగంకు మారి దశాబ్ద కాలం దాటింది. విజయశాంతి మొదటగా బీజేపీలో చేరింది. ఆ తర్వాత ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటే లక్ష్యంగా తల్లి తెలంగాణ పార్టీని స్థాపించారు. తెలంగాణ ఉద్యమాన్ని చేపట్టి తెలంగాణ బిడ్డగా ఊరూర తెలంగాణ ఉద్యమాన్ని నడపింది. తర్వాత తెలంగాణ సీఎం కేసీఆర్ స్థాపించిన టీఆర్ఎస్లో తల్లీ తెలంగాణ పార్టీని విలీనం చేశారు. తర్వాత మెదక్ ఎంపీగా గెలిచిన విజయశాంతి తెలంగాణ సాధన కోసం తనవంతుగా కృషి చేశారు. తర్వాత విజయశాంతి కాంగ్రేస్లో చేరారు. ప్రస్తుతం కాంగ్రేస్లో ఉన్న విజయశాంతి సినిమాలపై దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది.
విజయశాంతి ప్రిన్స్ మహేష్బాబు నటించబోతున్న 26వ చిత్రంలో అత్తగా నటించబోతున్నారు. విలక్షణ కథతో తయారవుతున్న ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించున్నారు. సరిలేరు నీకేవ్వరు అనే టైటిల్ ఖరారు చేసినట్టు, ప్రస్తుతం సినిమాకు సంబంధించిన ఫ్రీ ఫ్రోడక్షన్ నడుస్తున్నట్లు తెలిసింది. ఇదే చిత్రంలో జగపతిబాబు విలన్గా నటించబోతుండగా, రమ్యకృష్ణ మరో ముఖ్యపాత్రలో నటించబోతున్నట్లు వినికిడి. 12ఏళ్ళ విజయశాంతి రీ ఎంట్రీ ఇవ్వబోతున్న ఈ సినిమాపై సిని పరిశ్రమ ఆసక్తిగా ఎదురుచూస్తుంది.