బయోపిక్ కోసం విద్య బాలన్ రెమ్యూనరేషన్ తెలిస్తే షాకే

Google+ Pinterest LinkedIn Tumblr +

నందమూరి తారక రామ రావు గారి బయోపిక్ అనౌన్స్ చేసిన సమయం నుండి ఈ చిత్రం పై టాలీవుడ్ లో నే కాకుండా సౌత్ ఇండియా లో కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రముఖ నటుడు బాల కృష్ణ ఈ సినిమాలో లో లీడ్ రోల్ పోషిస్తున్న విషయం తెలిసిందే. క్రిష్ జాగర్లమూడి ఈ బయోపిక్ కి దర్శకత్వం వహిస్తున్నారు. అయితే మొదటి నుండి ఎన్టీఆర్ సతీమణి బసవతారకమ్మ పాత్రలో ఎవరిని నటింపచేయాలనే ఆలోచనలో చిత్ర బృందం చాల రోజులు సతమతమయ్యింది. చివరికి బాలీవుడ్ నటి విద్య బాలన్ ని ఈ రోల్ కి ఎంపిక చేసారు. అయితే విద్య బాలన్ ఈ చిత్రానికి తీసుకుంటున్న పారితోషికం ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. విద్య బాలన్ ఈ చిత్రం లో తన పాత్రకి గాను అక్షరాలా రూ 2 కోట్లు తీసుకుంటుందని ఇండస్ట్రీ లో టాక్. అయితే బాల కృష్ణే స్వయంగా ముంబై వెళ్లి విద్య బాలన్ ని ‘ఎన్టీఆర్’ బయోపిక్ లో నటించవలసిందిగా కోరారట. కొద్దీ రోజుల క్రితం విద్య హైదరాబాద్ వచ్చి బాల కృష్ణ ఇంటిలో వారి ఆతిధ్యాన్ని స్వీకరించారు. జులై చివరి వారం నుండి ఈ సినిమా షూటింగ్ బ్రేక్ లేకుండా జరగనుంది.

Share.