”బిగ్ బాస్ ” గా రాబోతున్న వెంకీ?

Google+ Pinterest LinkedIn Tumblr +

తెలుగు లో బిగ్ బాస్ ప్రోగ్రామ్ సక్సెస్ అయ్యింది. అయితే బిగ్ బాస్ సీజన్-1 ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించడంతో… ఈ షో బాగా సక్సెస్ అయ్యింది. అయితే ఆ తరువాత … వచ్చిన బిగ్ బాస్ సీజన్ 2 వరుస వివాదాలతో… రచ్చ రచ్చ అయ్యింది. దీంతో బిగ్ బాస్ సీజన్ 3 స్టార్ట్ చేసేందుకు సిద్ధం అవుతుండడంతో… ఈ షో కి హోస్ట్ గా ఎవరు వ్యవహరిస్తారు అనేది అందరిలోనూ ఆసక్తి రేపుతోంది. సీజన్ 1 కి ఎన్టీఆర్, సీజన్ 2 కి నాని వ్యవహరించగా సీజన్ 3 కి విక్టరీ వెంకటేష్ ఉండే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది.

గతంలో విజయ్ దేవరకొండ బిగ్ బాస్ సీజన్ -3కి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తారని ప్రచారం సాగింది. అయితే ఇప్పడు వెంకీ పేరు తెరపైకి రావడానికి పెద్ద కారణమే ఉందట. ఫ్యామిలీ ఆడియన్స్ ఈ కార్యక్రమం పై అంతగా ఆసక్తిని చూపడంలేదనే ఫీడ్ బ్యాక్ వచ్చిందట. అనుకూ… ఫ్యామిలీ ఆడియన్స్‌లో మంచి క్రేజ్ వున్న వెంకటేశ్‌ను హోస్ట్‌గా రంగంలోకి దింపాలనే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారట. ఈ మేరకు వెంకీతో చర్చలు కూడా జరిపారని టాక్.

సీజన్ 2 వివాదాల సుడిగుండంలో చిక్కుకుపోవడంతో…. సీజన్ -3లో అలాంటి సమస్యలు తలెత్తకుండా నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారుట. దీనిలో భాగంగా విక్టరీ వెంకటేష్ అయితేనే బాగుంటుదనుకుంటున్నారు. పైగా ఇప్పుడాయనకు సినిమాలు కూడా పెద్దగా లేవు. కాబట్టి అన్ని రకాలుగా అందుబాటులో ఉండగలడు. తెలివిగా వ్యవహరించి ఫ్యామిలీ ఆడియెన్స్ ను కూడా ఆకట్టుకోగలడని నిర్వాహకులు ఒక అంచనాకు వచ్చారు.

Share.