విక్టరీ వెంకటేష్ సోలో హీరోగా సినిమాలు చేయడం మానేశారా అంటే అవుననే అంటున్నారు. గురు తర్వాత కొద్దిపాటి గ్యాప్ తీసుకున్న వెంకటేష్ ప్రస్తుత వరుణ్ తేజ్ తో ఎఫ్-2, నాగ చైతన్యతో కలిసి వెంకీ మామ సినిమాలు చేస్తున్నాడు. ఇక ఈ సినిమాల తర్వాత అయినా వెంకటేష్ సోలో సినిమా ఉంటుంది అనుకుంటే మరో మల్టీస్టారర్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట వెంకటేష్.
ఈసారి ఏకంగా మళయాల మూవీలో నటిస్తున్నాడని తెలుస్తుంది. మళయాల స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ లీడ్ రోల్ లో నూతన దర్శకుడు చేస్తున్న ఓ క్రేజీ మూవీలో దుల్కర్ తో పాటుగా వెంకటేష్ నటిస్తున్నాడట. ఇందులో వెంకటేష్ ఆర్మీ జనరల్ గా కనిపిస్తాడని అంటున్నారు. మళయాల హీరో అయినా దుల్కర్ సల్మాన్ నటించిన ఓకే బంగారం, మహానటి సినిమాలు తెలుగులో మంచి ఫలితాన్ని అందుకున్నాయి. కాబట్టి ఈ మల్టీస్టారర్ కూడా క్రేజీగా మారింది. వెంకటేష్ సోలో సినిమా కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నా క్రేజీ కాంబినేషన్స్ తో కూడా ఫ్యాన్స్ ను అలరించే ప్రయత్నాల్లో ఉన్నాడు వెంకటేష్.