బుచ్చిబాబు సన దర్శకత్వంలో మెగా మేనల్లుడు వైష్ణవి తేజ్ హీరోగా మొదటి సారి తెలుగు సినీ ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయం అయింది కృతి శెట్టి. ఇక మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న ఈమెకు ఆఫర్లు కూడా వచ్చాయని చెప్పవచ్చు. ఇక తర్వాత ఈమె నాగార్జున, నాగచైతన్య తో కలిసి నటిస్తున్న బంగార్రాజు సినిమాల్లో నాగలక్ష్మి అనే క్యారెక్టర్ కు కూడా ఎంపిక అయ్యి అక్కడ కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంటోంది. ఇప్పుడు తాజాగా నటిస్తోన్న సినిమాలో కూడా మరొక హీరోయిన్ గా నటిస్తోంది. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్ నిన్న విడుదల చేయగా కృతి శెట్టి పాత్రను చూసి అందరూ షాక్ అవుతున్నారు.
తాజాగా విడుదలైన ట్రైలర్‌లో ఈ అమ్మడు ఫుల్లుగా రెచ్చిపోయింది. పూర్తిగా మోడ్రన్ క్యారెక్టర్ చేసింది కృతి శెట్టి. ఇక ధూమపానం చేస్తూ కనిపించింది. అంతేకాదు.. నానితో ముద్దు సన్నివేశాలు కూడా చేసింది కృతి. వీటికి సంబంధించిన విజువల్స్ ఇప్పుడు ట్రైలర్‌లో వైరల్ అవుతున్నాయి. మరోవైపు నాని కూడా లిప్‌లాక్ సీన్స్ చేయడం ఆసక్తికరంగా మారింది.