వర్మ కొండా సినిమా నుంచి సాంగ్ రిలీజ్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

సంచలన సినిమాల దర్శకుడు రాంగోపాల్ వర్మ.. తాజాగా కొండా అనే సినిమా టైటిల్ తో ఒక సినిమా చేస్తున్నారు. వరంగల్ ప్రాంతానికి చెందిన మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ భర్త, కొండ మురళి జీవిత కథ ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. అదిత్ అరుణ్, ఇర్రా మోర్ ప్రధాన పాత్రలో ఈ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాని యోయో టాకీస్ పై.. మల్లారెడ్డి, నవీన్ రెడ్డి నిర్మిస్తున్నారు.

అయితే కొండా సినిమా షూటింగులో కొద్ది రోజుల క్రితమే వరంగల్ ప్రాంతంలో మొదలుపెట్టారు. కానీ కొన్ని కారణాల చేత అక్కడ అ పూర్తి షెడ్యూల్ చేసుకోలేకపోయారు. కొంత భాగం బయట చిత్రీకరించిన తర్వాత ఇప్పుడు పరిస్థితులు అనుకూలించడంతో తిరిగి వరంగల్లోనే షూటింగ్ చేస్తున్నారు రాంగోపాల్ వర్మ. అయితే ఇప్పుడు తాజాగా ఈ సినిమా నుంచి భలే భలే అనే విప్లవ గీతాన్ని విడుదల చేశారు.ఇక ఈ పాటని సిరాశ్రీ రాసిన ఈ విప్లవ గీతాన్ని వరంగల్ గద్దర్తో కలిసి వర్మ పాడించారు. ఏది ఏమైనా వర్మ ఎప్పుడు సరికొత్త విభిన్నమైన కథతోనే వస్తూ ఉంటారు.

Share.