వ‌రుణ్‌తేజ్ వాల్మీకి ప్రీ-రివ్యూ

Google+ Pinterest LinkedIn Tumblr +

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ వాల్మీకి. కోలీవుడ్‌లో నాలుగేళ్ల క్రితం తెర‌కెక్కి సూపర్ హిట్ అయిన జిగర్తాండ సినిమాకు అధికారిక రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమాపై టాలీవుడ్ ప్రేక్షకులలో మంచి అంచనాలు ఉన్నాయి. వరుణ్ తేజ్ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మించడం జరిగింది. మంచి మాస్… మరియు కమర్షియల్ హంగులతో తెరకెక్కిన ఈ సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇక సెన్సార్ టాక్ ప్ర‌కారం ఈ సినిమా చాలా డిఫ‌రెంట్ కాన్సెఫ్ట్‌తో తెర‌కెక్కిన‌ట్టు తెలుస్తోంది. మొత్తం 168 నిమిషాల నిడివిగల ఈ సినిమాకు యు/ఏ సర్టిఫికెట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ర‌న్ టైం ప‌రంగా చూస్తే నిడివి ఎక్కువ‌గానే ఉన్నా ద‌ర్శ‌కుడు హ‌రీష్ శంక‌ర్ చాలా అద్భుతంగా సినిమాను తెర‌కెక్కించిన‌ట్టు తెలుస్తోంది. గణేష్ అనే ఒక సాధారణ వ్యక్తి, పరిస్థితుల ప్రభావం వలన గద్దలకొండ గణేష్ అనే గ్యాంగ్ స్టర్ గా ఎలా ?మారాడు అనేది ఈ సినిమాలోని మూల కథాంశమట.

ఇక మ‌ధ్య‌లో గ‌ణేష్ ల‌వ్ స్టోరీతో పాటు తాను తీసే సినిమా కోసం ఓ గ్యాంగ్‌స్ట‌ర్‌ను వెతికే రోల్‌లో కోలీవుడ్ హీరో అథ‌ర్వ ముర‌ళీ నిజ‌మైన గ్యాంగ్‌స్ట‌ర్ అయిన గ‌ణేష్‌ను తీసుకుంటాడు ? ఇక వ‌రుణ్ ప‌క్కా ఊర‌మాస్ క్యారెక్ట‌ర్‌లో న‌టించిన‌ట్టు తెలుస్తోంది. ఇక సినిమాలో వ‌రుణ్ క్యారెక్ట‌ర్‌తో పాటు వెల్లువొచ్చి గోదారమ్మ రీమిక్స్ సాంగ్‌తో పాటు జర్ర జర్ర సాంగ్స్ సినిమాకు పెద్ద హైలైట్ అని… అలాగే సినిమాలో కీల‌క‌మైన యాక్ష‌న్స్‌, చేజింగ్స్ సీన్స్ దుమ్ము రేపాయ‌ని అంటున్నారు. ఇక హీరోయిన్ పూజ అందాలు, న‌ట‌న కూడా చాలా హైలెట్ అని తెలుస్తోంది. మ‌రి వాల్మీకిగా వ‌రుణ్ ఎలా ? మెప్పించాడో ? కొద్ది గంట‌ల్లో తేలిపోనుంది.

Share.