అక్కినేని నాగ చైతన్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘శైలజా రెడ్డి అల్లుడు’ ప్రస్తుతం షూటింగ్ ముగించుకుని శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఈ సినిమాతో ఖచ్చితంగా హిట్ కొట్టాలని చూస్తున్నాడు హీరో నాగ చైతన్య. ఈ సినిమాను దర్శకుడు మారుతి డైరెక్ట్ చేస్తుండటంతో జనాల్లో కూడా మంచి అంచనాలు ఏర్పడ్డాయి. కాగా ఈ సినిమాను తాజాగా మారుతితో కలిసి నిర్మాత రాధాకృష్ణ(చినబాబు), స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ వీక్షించారు.
ఈ సినిమా బాగుందంటూ రాధాకృష్ణ చిత్ర యూనిట్‌ను ప్రశంసలతో ముంచెత్తారు. ఆయన సినిమా ఖచ్చితంగా విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కానీ ఇక్కడ పెద్ద ట్విస్ట్ ఏమిటంటే.. త్రివిక్రమ్ ఈ సినిమా గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. సినిమా గురించి ఏదైనా మాట్లాడమని త్రివిక్రమ్‌ను కోరగా మరొక డైరెక్టర్ చేసిన పనిపై తాను ఎలాంటి కామెంట్ చేయడం బాగుండదని త్రివిక్రమ్ ఆన్సర్ ఇచ్చాడు. దీంతో చిత్ర యూనిట్ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇలా త్రివిక్రమ్ తమ సినిమా గురించి ఏమీ మాట్లాడకపోవడంతో వారు ఖంగారు పడుతున్నారు.
త్రివిక్రమ్‌కు ఈ సినిమా నచ్చలేదేమో.. అందుకే ఆయన ఏమీ మాట్లాడటం లేదంటూ సోషల్ మీడియాలో వార్తలు షికారు చేస్తున్నాయి. దీంతో ఈ సినిమా విజయంపై బయ్యర్లలో భయం మొదలయ్యింది. ఏదేమైనా రిలీజ్‌కు ముందే ఇలాంటి వాతావరణం నెలకొనడం ‘శైలజా రెడ్డి అల్లుడు’కు ఎంత మేలు చేస్తుందో చూడాలి. ఈ సినిమాలో అను ఇమ్మాన్యుయెల్ హీరోయిన్‌గా నటిస్తోండగా రమ్యకృష్ణ అత్త పాత్రలో నటిస్తోంది. ఈ సినిమాను ఆగష్టు 31న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.