త్రివిక్రం, అల్లు అర్జున్ ఈ ఇద్దరి కాంబినేషన్ లో జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలు వచ్చాయి. ఆ సినిమాల టైంలో అల్లు అర్జున్ కు మాస్ ఇమేజ్ తక్కువే ఎప్పుడైతే సరైనోడు వచ్చిందో స్టైలిష్ స్టార్ ఇమేజ్ అమాంతం పెరిగింది. అయితే ఇప్పుడు అదే ఇమేజ్ త్రివిక్రం కు అడ్డుగా మారింది. నా పేరు సూర్య తర్వాత బన్ని ఫైనల్ గా త్రివిక్రం తో సినిమా ఫిక్స్ చేసుకున్నాడని అంటున్నారు. త్వరలో సెట్స్ మీదకు వెళ్లబోతున్న ఈ సినిమా రీమేక్ అవుతుందని తెలుస్తుంది. త్రివిక్రం కెరియర్ లో రీమేక్ చేయలేదు. అలాంటిది బన్ని కోసమే ఫస్ట్ టైం రీమేక్ కు ఫిక్స్ అయ్యాడట.
క్రియేటివ్ డిఫరెన్స్ వల్లే త్రివిక్రం, బన్ని రీమేక్ చేయాల్సి వస్తుందని అంటున్నాడట. త్రివిక్రం ఏ లైన్ చెప్పినా అలా ఉంది ఇలా ఉంది అంటూ చిరాకు తెప్పిస్తున్నాడట బన్ని. అజ్ఞాతవాసి ముందు వరకు త్రివిక్రం రేంజ్ వేరు ఆ ఫ్లాప్ తర్వాత అత్నైతో స్టార్ హీరోల రిలేషన్ కూడా మారిందని అంటున్నారు. ముఖ్యంగా బన్ని త్రివిక్రం ఏం చెబితే అది చేసేవాడు ఇప్పుడు త్రివిక్రం కు సలహా ఇచ్చే పొజిషన్ కు వచ్చాడు. అయితే దర్శకుడు ఎవరైనా సినిమా తీస్తే హిట్టైనా ఫట్టైనా హీరోకే బొక్క కాబట్టి ఇందులో బన్నిని తప్పుపట్టాల్సింది ఏమి లేదు.
హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో ఈ సినిమా తెరకెక్కుతుంది. రెండు సూపర్ హిట్లు కొట్టిన తర్వాత వస్తున్న హ్యాట్రిక్ మూవీగా ఈ ఇద్దరు ఎలాంటి మూవీ చేస్తారు అన్న దాని మీద మెగా ఫ్యాన్స్, అల్లు ఫ్యాన్స్ లో క్యూరియాసిటీ మొదలైంది. అయితే న్యూ ఇయర్ గిఫ్ట్ గా ఈ మూవీ ఎనౌన్స్ మెంట్ ఉంటుందని తెలుస్తుండగా ఆరోజు ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే సర్ ప్రైజ్ ఇస్తారని చెబుతున్నారు. ఇదే కాకుండా అల్లు అర్జున్ పరశురాం డైరక్షన్ లో సినిమా చేసే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది.