తారకరత్నను చూడడానికి తల్లిదండ్రులు ఇంటికి రాకుండా ఫిలిం ఛాంబర్ కే రావడానికి కారణం..?

Google+ Pinterest LinkedIn Tumblr +

నందమూరి వారసుడు తారకరత్న అంత్యక్రియలు కొద్దిసేపటి క్రితం ముగిసాయి.. గత 23 రోజులుగా నారాయణ హృదయాలయ హాస్పిటల్ లో మృత్యువుతో పోరాడి శివరాత్రి రోజు మరణించారు. 39 సంవత్సరాల వయసులో ఎంతో భవిష్యత్తు ఉన్న తారకరత్న తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడం నిజంగా బాధాకరమైన విషయమని చెప్పాలి. తారకరత్న మరణంతో ఆయన భార్య ,ముగ్గురు పిల్లలు ఒంటరి వారయ్యారు. ఇక వారందరి బాధ్యత నందమూరి బాలకృష్ణ తీసుకున్నట్లుగా విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు.

ఇదిలా ఉండగా తారకరత్న మరణించిన తర్వాత ఆయన భౌతిక కాయాన్ని తన స్వగ్రామమైన మోకిలా కి తీసుకెళ్లారు. అయితే అక్కడ నందమూరి కుటుంబ సభ్యులు దాదాపు చాలామంది కనిపించారు కానీ నందమూరి తారకరత్న తల్లిదండ్రులు మాత్రం కనిపించలేదు ఈ విషయం మీద ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది.. వారు వచ్చారని నందమూరి అభిమానులు వాదిస్తుంటే రాలేదని ఇతర వర్గాల వారు వాదించారు. అయితే అసలు విషయం ఏమిటి అంటే.. నిజంగానే నందమూరి తారకరత్న తల్లిదండ్రులు మోకిలా నివాసానికి వెళ్లలేదని తెలుస్తోంది..

మోకిలా నివాసం నందమూరి తారకరత్న భార్య అలేఖ్య రెడ్డికి చెందింది కావడంతో కోడలితో ఉన్న విభేదాల కారణంగా కుమారుడి చివరి చూపు చూసేందుకు కూడా అక్కడికి వారు వెళ్ళలేదని తెలుస్తోంది. ఎప్పుడైతే తారకరత్న పార్థివ దేహాన్ని తీసుకొచ్చి ఫిలిం చాంబర్లో ఉంచారు . అప్పటికే ఉన్న తారకరత్న తల్లిదండ్రులు వెళ్లి తారకరత్న పార్థివదేహాన్ని సందర్శించారు. ఆయన తల్లిదండ్రులు వెక్కివెక్కి ఏడుస్తూ కనిపించడం నిజంగా బాధని కలిగిస్తోంది.. నిజానికి ఎంత పంతాలు ఉన్నా సరే చావు దగ్గర మాత్రం ఈ పంతం ఏమిటి? అని కొంతమంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. కొడుకుని పట్టించుకోని ఈ తల్లిదండ్రులు వారి వారసులను ఎలా చూసుకుంటారు అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. బాలయ్య అండగా ఉన్నారు కాబట్టి అలేఖ్య రెడ్డి కాస్త కుదుటపడ్డారని చెప్పవచ్చు.

Share.