బాధ భరించలేనిది.. కన్నీటి ఆవేదన బయటపెట్టిన మమత మోహన్ దాస్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో యమదొంగ సినిమా ద్వారా అడుగు పెట్టి తన నటనతో ప్రేక్షకులను అలరించిన ఈమె.. ఆ తర్వాత చింతకాయల రవి తోపాటు పలు సినిమాలలో నటించి మరింతగా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయింది.. నటిగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న సమయంలోనే అతి భయంకరమైన క్యాన్సర్ మహమ్మారి బారిన పడిన మమతా మోహన్ దాస్ ఎంతో ధైర్యంగా క్యాన్సర్ తో పోరాడి తన ఆరోగ్యాన్ని చక్కదిద్దుకుంది.. అయితే ఆ తర్వాత మరికొన్నాళ్ళకు ఇంకొకసారి క్యాన్సర్ సోకడంతో.. కఠినమైన వ్యాయామాలు.. ఆహార నియమాలను పాటిస్తూ ఎంతో ధైర్యంగా ఈ భయంకరమైన వ్యాధి నుంచి దాదాపు రెండుసార్లు బయటపడింది.

Mamta Mohandas looks oh-so-gorgeous in THESE pictures! | Malayalam Movie  News - Times of India

అలా క్యాన్సర్ నుంచి బయటపడిందో లేదో ఇలా మరొక వ్యాధి ఆమెను కృంగదీయడం నిజంగా బాధాకరమని చెప్పాలి.. తాజాగా ఆమె ఆటో ఇమ్యూన్ వ్యాధికి గురయ్యారు. అది బొల్లి వ్యాధికి దారితీసింది. సాధారణంగా హీరోయిన్లు అందానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు. అలాంటి హీరోయిన్లకు ఈ బొల్లి వ్యాధి వస్తే వారి బాధ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ వ్యాధి సోకిందని తెలియగానే తాను పడిన మానసిక క్షోభ గురించి తాజాగా ఒక ఇంటర్వ్యూ సందర్భంగా మమత మోహన్ దాస్ బయటపెట్టారు.

South actress Mamta Mohandas diagnosed with vitiligo; here's everything you  need to know about this autoimmune disease | The Times of India

మహేష్ మారుతియుమ్ సినిమా షూటింగ్ సమయంలో ఒంటిపై మచ్చలు గమనించాను అవి ముఖం చేతులు మెడ పై వ్యాపించాయి దాంతో ఒక్కసారిగా భయపడిపోయి పరీక్షలు చేయించుకున్నాను అయితే ఆ పరీక్షలలో అది బొల్లి వ్యాధి అని తెలియగానే ఒక్కసారిగా ఒంటరి అయ్యాను.. అనే ఫీలింగు నన్ను మరింత కుదిపేసింది.. క్యాన్సర్ వచ్చినప్పుడు కూడా నేను అంత భయపడలేదు.. కానీ ఈ విషయాన్ని ఎవరికీ చెప్పుకోలేక.. ఒక్కదాన్నే ఇంట్లో నెలలు తరబడి కూర్చొని ఏడ్చే దానిని అంటూ తన మానసిక బాధను బయటపెట్టింది.. ఈ వ్యాధికి మెడిసిన్ వాడుతుంటే ఊపిరితిత్తుల సమస్య వచ్చింది దాంతో మెడిసిన్ కూడా ఆపేసాను… ఒంటరి అయిపోతానేమోనని భయం కలిగింది.. ఆ తర్వాత నా స్నేహితులకు చెప్పడంతో కాస్త మనశ్శాంతిగా ఉంది.. ఇప్పుడు ధైర్యంగా ఈ సమస్యను ఎదుర్కోగలుగుతున్నాను అంటూ చెప్పుకొచ్చింది మమతా మోహన్ దాస్..

Share.