తన చెల్లెలు పై షాకింగ్ కామెంట్స్ చేసిన సాయి పల్లవి..!

Google+ Pinterest LinkedIn Tumblr +

తెలుగు రాష్ట్రాలలో స్టార్ హీరోల సరస నటించక పోయినప్పటికీ.. హీరోయిన్ గా సాయి పల్లవి స్టార్ హీరోయిన్ రేంజ్ ను సొంతం చేసుకుంది. తాజాగా లవ్ స్టొరీ సినిమాతో సాయి పల్లవి క్రేజ్ అమాంతం పెరిగింది. తన నటనతో, డాన్స్ తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అయితే తాజాగా సాయి పల్లవి చెల్లెలు పూజ కన్నన్ కూడా కోలీవుడ్లో చితిరై సెవ్వానమ్ ఈ సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తోంది. ఈ సినిమా ఓటిటి (zee-5) లో విడుదల కానుంది.

తన చెల్లి సినిమా ఓటిటీలో స్ట్రీమింగ్ అవుతుండడంతో.. చెల్లి తో దిగిన చిన్ననాటి ఫోటోను షేర్ చేసింది సాయి పల్లవి. డిసెంబర్ మూడవ తేదీన తనకు స్పెషల్ డే అని ఆమె తెలిపారు. తను నటించే ప్రతి సినిమాలోనూ నా చెల్లెలు ఎదగాలని తాను కోరుకుంటున్నాను సాయిపల్లవి తెలియజేసింది. తన చెల్లి నటన ఇప్పటివరకు తాను మాత్రమే చూశానని.. ఇకమీదట తన చెల్లి నటన ప్రపంచం మొత్తం చూస్తుంది అని సాయి పల్లవి తెలియజేసింది. ప్రేక్షకులు తన చెల్లెలు నటించిన సినిమా ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నానని తెలియజేసింది. ఈ సినిమా సక్సెస్ కావాలంటే మనం కూడా కోరుకుందాం.

Share.