సైరాకు 8కోట్ల డిమాండ్…!

Google+ Pinterest LinkedIn Tumblr +

భారత దేశానికి స్వాతంత్య్రం కోసం పోరాటం చేసి అసువులు బాసిన మొదటితరం పోరాట యోధుడు ఉయ్యాలవాడ నరసింహరెడ్డి బయోపిక్గా రూపొందిన చిత్రం సైరా నరసింహారెడ్డి. ఓ యోధుడి జీవిత చరిత్ర వెండితెరపై వస్తుందంటే ఆ వీరుడికి సమాజంలో ఎంతో పాపులారిటీ రావడంతోపాటు కుటుంబానికి కూడా అత్యున్నతమైన గౌరవం లభిస్తుంది. కానీ ఇక్కడ చిత్రం ఏంటంటే యోధుడి జీవితచరిత్రను సినిమా తీయాలంటే రూ.8కోట్లు ఇవ్వాలనే డిమాండ్ చేస్తున్నారట నరసింహారెడ్డి కుటుంబ సభ్యులు.

మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని చిరంజీవి తనయుడు మెగా పవర్ స్టార్ రామ్చరణ్ నిర్మిస్తున్నాడు. సొంత నిర్మాణ సంస్థ కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ నుంచి ఈసినిమాను భారీ బడ్జెట్తో నిర్మితం అవుతుంది. అయితే నిర్మాతగా రామ్ చరణ్ ఉయ్యాలవాడ కుటుంబ సభ్యులను కలిసి కథ కోసం అగ్రిమెంట్ కుదుర్చుకున్నాడట. అగ్రిమెంటు ప్రకారం లక్షల్లో ఒప్పందం కుదిరిందట.

కథతో పాటుగా నరసింహారెడ్డి ఇంటిని, గ్రామంలో కూడా షూటింగ్ కోసం వాడుకున్నారట. దీంతో శనగ పంట, మరి కొన్ని పంటలు నాశనం అయ్యాయట. అయితే షూటింగ్ సమయంలో కూడా నష్టపరిహారంపై ఒప్పందం కుదిరిందట. కాని భారీ ఎత్తున ఖర్చు చేసి తీస్తున్న ఈ సినిమాకు మాకు రూ.8కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారట. పరిహారం కోసం, కథకు, ఇంటిని వాడుకున్నందుకు రూ.8కోట్ల కోసం రామ్చరణ్ ఆఫీసుకు వెళితే కాదు పొమ్మన్నారని ఆందోళన చేసిన విషయం తెలిసిందే. అయితే సైరా విడుదల అక్టోబర్ 2 దగ్గర పడుతున్న తరుణంలో ఇప్పుడు ఇలాంటి వివాదాలు రావడంతో సినిమాపై నీలినీడలు అలుముకున్నాయి. సో సైరా వివాదం ముగిసిపోతుందా… లేదా అనేది వేచిచూడాల్సిందే.

Share.