టాలీవుడ్‌లో దశాబ్దంన్నర క్రితం కమెడియన్ గా కెరీర్ స్టార్ట్ చేసి ఒక్కసారిగా టాప్ కమెడియన్‌గా దూసుకుపోయిన సునీల్ వరుస పెట్టి స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్సులు దక్కించుకున్నాడు. ఒక టైంలో తెలుగు ప్రేక్షకులు కేవలం సునీల్ కామెడీ చూసేందుకే పదే పదే రిపీటెడ్‌గా సినిమాలు చూసేవారు అంటే అతియోశక్తి కాదేమో..! అలాంటి సునీల్ ఎప్పుడైతే హీరోగా మారాడో అప్పటి నుంచి అతని తలరాత పూర్తిగా రివర్స్ అయింది. హీరోగా మారాక ఒకటి రెండు హిట్లు కొట్టిన సునీల్ అప్పటి నుంచి వరుస ఫ్లాపులతో కెరీర్ పరంగా పూర్తిగా పాతాళంలోకి పడిపోయాడు.
ఇప్పుడు సునీల్‌తో సినిమాలు చేసేందుకు దర్శక, నిర్మాతలు ఎవరు ముందుకు రాని పరిస్థితి. సునీల్ మార్కెట్ హీరోగా పూర్తిగా దిగజారిపోయింది. హీరోగా కాలం కలిసి రాక పోవడంతో తిరిగి కమెడియన్‌గా యూటర్న్ తీసుకున్నాడు. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. సునీల్‌కు పోటీగా టాలీవుడ్ లో చాలా మంది కమెడియన్లు వచ్చేశారు. వీరితో పోటీని తట్టుకుని సునీల్ తిరిగి కమెడియన్‌గా రాణించడం కూడా కష్టమైంది. ప్రస్తుతం సీనియర్ హీరోల సినిమాల్లో బెస్ట్ కామెడీ రోల్స్ ఉంటే వాటిని వాళ్లు అల్లరి నరేష్‌కు ఇవ్వమని సూచిస్తున్నారట.
మహర్షి సినిమాలో అల్లరి నరేష్ పాత్రకు చాలా ప్రాధాన్యత ఉంది. ఈ సినిమా విజయంలో నరేష్ రోల్ కూడా ఎంతో కీలకంగా నిలిచింది. ఇక ఇప్పుడు రవితేజ డిస్కో రాజా సినిమాలోనూ కీలకమైన కమెడియన్ రోల్ ఒకటి ఉందట. ఇందుకోసం ముందుగా సునీల్ పేరు పరిశీలించినా ఇప్పుడు నరేష్ పేరు పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. అలాగే వరుస హిట్లతో ఉన్న మరో యంగ్ హీరో సినిమాలో కమెడియన్ రోల్‌కు కూడా నరేష్ పేరు పరిశీలిస్తున్నారట.
ఏదేమైనా కమెడియన్‌గా రీ ఎంట్రీ ఇచ్చిన సునీల్‌కు ఇప్పుడు నరేష్ రూపంలో పెద్ద పోటీ ఎదురు కానుంది. అల్లరి నరేష్ సినిమాలు సక్సెస్ కాకపోవడంతో పెద్దగా లేట్ చేయకుండా కమెడియన్‌గా మారాడు. మహర్షి ఇచ్చిన ఊపుతో నరేష్ ఇలాంటి రోల్స్ ఒప్పుకునేందుకు ఇష్టంగానే ఉన్నాడట. సునీల్‌కు వచ్చే ఈ రోల్స్ ఇప్పుడు నరేష్ ఖాతాలో పడితే సునీల్ కెరీర్ మళ్లీ గందరగోళమైనట్టే.