ఈ వీకెండ్ కి స్టార్ హీరోయిన్ ఎంట్రీ..?

Google+ Pinterest LinkedIn Tumblr +

బిగ్ బాస్ సీజన్ 2 మొదలై నెల రోజులు అయినా షో పై ఏ మాత్రం ఆసక్తి కలగటం లేదు. ఇందుకు ప్రధాన కారణం షో ని హోస్ట్ చేస్తున్న నాని ఒకటైతే, షో లో ఉన్న పార్టిసిపంట్స్ కూడా ఆశించినంత బాగా పెర్ఫర్మ్ చేయకపోవటం. రెండో సీజన్ లో నాని, ఎన్టీఆర్ షో ని నడిపిన స్థాయిలో నడపలేకపోవటం ప్రేక్షకులని కాసింత నిరుత్సహ పరిచింది. గత సంవత్సరం మొదటి సీజన్ లో కూడా ఇంతే ఆసక్తి తగ్గిన సమయంలో షో నిర్వహులు దీక్షా పంత్ ని వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా బిగ్ బాస్ హౌస్ లోకి ప్రెవేశ పెట్టారు. అప్పటి నుండి దీక్ష కాస్ట్యూమ్స్ కి తన బోల్డ్ యాక్టింగ్ తో ప్రేక్షకులని కొంత వరకు మెప్పించ కలిగింది.
అయితే ఇప్పుడు అదే తరహాలో రెండో సీజన్ కి కూడా ప్రముఖ నటి హెబ్బా పటేల్ ని బిగ్ బాస్ హౌస్ కి తీసుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారట షో నిర్మాతలు. ఇదే నిజమైతే సీజన్ 2 కూడా కొంత వరకు యువతని షో వైపు ఆకర్షించగలదని వారి అభిప్రాయం. సినిమాల్లో హాట్ గా ఘాటైన సన్నివేశాలలో యువతని మెప్పించినట్టే షో లో కూడా హెబ్బా ప్రేక్షకులని ఆకర్షిస్తుందని కోరుకుందాం. ఇప్పటికే షో నిర్వహులు ఆమెతో సంప్రదించారని తాను వచ్చేది లేనిదీ ఈ వారం తెలుస్తుందని సమాచారం.


Share.