స్టార్ హీరోలు హీరోయిన్లు ఎంత సీక్రెసీ మెయింటేన్ చేద్దామనుకున్నా అది ఎలాగోలా పబ్లిక్‌లోకి వచ్చేస్తుంది. ఇక తమ పర్సనల్ లైఫ్ విషయాలను అస్సలు బయటకు రాకుండా జాగ్రత్త పడతారు. దీంతో తమ పర్సనల్ విషయాలను బయటకు ముఖ్యంగా కెమెరా కంటికి చిక్కకూడదని సెలిబ్రిటీలు నానా పాట్లు పడుతుంటారు. ఇక తమ ప్రేమ వ్యవహారాలు, ఎఫైర్ల గురించి ఎలాంటి లీక్ ఇవ్వకుండా సెలిబ్రిటీలు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు.
బాలీవుడ్‌లో ఇలాంటి ప్రేమ వ్యవహారాలు మనం చాలానే చూశాం. ఇక ఇందులో స్టార్ బ్యూటీ దీపికా పదుకొనె, రణ్‌వీర్ సింగ్‌ల లవ్ ఎఫైర్ గురించి చాలా రోజులుగా అనేక వార్తలు వినిపిస్తున్నాయి. వీరి ప్రేమ వ్యవహారంపై బాలీవుడ్ మీడియా మొత్తం కోడై కూస్తోంది. అయినా కూడా వీరు తమ ప్రేమకు సంబంధించి ఎలాంటి స్టేట్‌మెంట్ ఇవ్వలేదు. ఇక వీరు చాలా సార్లు హాలిడే ట్రిప్స్‌లో మీడియా కంటికి చిక్కారు. తాజాగా దీపికా మరియు రణ్‌వీర్ చెట్టాపట్టాలేసుకుని తిరగుతూ కెమెరా కంటికి చిక్కారు. అమెరికా ఓర్లాండోలో ఉన్న డిస్నీ ల్యాండ్ దగ్గర ఈ జంట దర్శనమిచ్చారు.
నిజానికి వీరు అక్కడ ఉన్న సంగతి వారి కుటుంబ సభ్యులకు తప్పితే ఇతరులకు తెలీదు. అయితే డిస్నీ ల్యాండ్ లాంటి పర్యాటక ప్రాంతంలో వీరిద్దరినీ గుర్తుపట్టిన కొంతమంది తమ సెల్‌ఫోన్‌లో వీడియో తీసి దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో వీరి సీక్రెట్ టూర్ కాస్త జనాలకు బట్టబయలు అయ్యింది. నవంబర్ 10న వీరి వివాహం ఇటలీలో జరగబోతున్నట్లు బాలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో ఈ టూర్‌లో వారు తమ పెళ్లికి కావాల్సిన షాపింగ్ కోసం వచ్చి ఉంటారని అంటున్నారు వారి సన్నిహితులు.