శ్రీ వై ఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘యాత్ర’. ప్రముఖ మలయాళ నటుడు మమ్మూట్టి ఈ బయోపిక్ లో వైస్సార్ పాత్రని పోషిస్తున్న విషయం తెలిసిందే. అయన తాజాగా సినిమా మొదటి షెడ్యూల్ లో కూడా పాల్గొన్నారు. ఇక ఈ రోజు మరో వార్త టాలీవుడ్ లో చెక్కర్లు కొడుతుంది. అదే ఈ సినిమాలో మరో కీలక పాత్ర వై ఎస్ జగన్ రోల్ ని ప్రముఖ తమిళ నటుడు కార్తీ చేస్తున్నారని సమాచారం.
ఇప్పటి వరకు ఈ వార్త పై అటు చిత్ర యూనిట్ కానీ కార్తీ వైపు నుండి కానీ ఎటువంటి అధికారిక ప్రకటన విడుదల కాలేదు. ఇదే కానీ నిజమైతే కార్తీ తెలుగులో మరో క్రేజీ ఆఫర్ ని కొట్టేసినట్టే. మహి వి రాఘవ్ ఈ చిత్రానికి దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. విజయ్ చిల్ల, శశి దేవి రెడ్డి సంయుక్తంగా ఈ సినిమాని 70 ఎం ఎం బ్యానర్ పై నిర్మిస్తున్నారు.