పాపం సోను సూద్, గెడ్డం ఎంత పని చేసింది

Google+ Pinterest LinkedIn Tumblr +

నటుడు సోను సూద్ ప్రతిష్ఠాత్మక చిత్రం ‘ మణికర్ణికా ‘ నుండి తప్పుకుంటున్నట్టు బాలీవుడ్ మీడియా లో వార్తలు హాల్ చల్ చేస్తున్నాయి. ప్రస్తుతం సోను సూద్ రోహిత్ శెట్టి దర్శకత్వం లో ‘ సీంమ్బా ‘ చిత్రంలో నటిస్తున్నారు, ఈ చిత్రం లో సోను చాల రఫ్ గా గెడ్డం తో కనిపించనున్నారు. ఈ చిత్రం షూటింగ్ మరి కొన్ని రోజుల్లో ముగియనుంది. అయితే మణికర్ణికా చిత్రంలో కూడా సోను సూద్ ఒక ముఖ్య భూమిక పోషిస్తున్నారు, ఆ పాత్ర కోసం దర్శకుడు అతన్ని గెడ్డం తీసి క్లీన్ షేవ్ లో నటించాలని కోరగా, అందుకు సోను సూద్ ‘ సీంమ్బా ‘ షూటింగ్ ముగిసిన తర్వాత మణికర్ణికా చిత్రం షూటింగ్ లో పాల్గొంటానని, ఇప్పుడు గెడ్డం తీయటం కుదరదు అని చెప్పారట. అయితే దర్శకుడు ససేమీరా అనటంతో సోను సూద్ ప్రతిష్ఠాత్మక చిత్రం  ‘ మణికర్ణికా ‘  నుండి తప్పుకోవాలని నిర్ణయించుకున్నారు.

అయితే సోను సూద్ ముందుగా కమిట్ అయినా ‘ సీంమ్బా ‘ చిత్రానికే అధిక ప్రాధాన్యం ఇవ్వటంతో, ఈ చిత్రం కోసం డేట్స్ సర్దుబాటు చేయలేక తప్పుకున్నారు. సోను సూద్ తీసుకున్న ఈ నిర్ణయంతో చిత్ర యూనిట్  సభ్యులు  ఆశ్చర్య పోయారట. మణికర్ణికా చిత్రాన్ని ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ క్రిష్ తెరకెక్కిస్తుండగా, నటి కంగనా రౌనత్ లీడ్ రోల్ పోషిస్తున్నారు.

 

Share.