శ్యామ్ సింగరాయ్ మూవీ నుంచి అద్భుతమైన ట్రైలర్ రిలీజ్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

నాని హీరోగా, రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం.. శ్యామ్ సింగరాయ్. ఇక ఈ సినిమాని నిహారిక ఎంటర్టైన్మెంట్ పతాకంపై వెంకట్ బోయినపల్లి నిర్మించారు. ఇక ఇందులో కథానాయకులుగా సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నాశెబాస్టియన్ నటిస్తున్నారు. ఇక ఈ సినిమా ఈనెల 24వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా కు సంబంధించి ఒక ట్రైలర్ ని విడుదల చేసింది చిత్రబృందం.

ట్రైలర్ విషయానికి వస్తే కొలకత్తా బ్యాక్ డ్రాప్ లో 1970 కాలం నాటి కథతో తెరకెక్కిన ఈ సినిమాలో నాని రెండు డిఫరెంట్ పాత్రలో కనిపించనున్నారు. తన పాత్రకు తగినట్టుగానే నాని ఇందులో ఒదిగిపోయిన నటించాడు. నాని చెప్పి సినిమాలోని డైలాగులు ప్రేక్షకులను బాగా ఆకట్టుకొంటున్నాయి. ముగ్గురు కథానాయికలు రైళ్లల్లో ప్రత్యేకంగా ఆకర్షనీయంగా నిలిచారు. ఇక ఈ సినిమాకి మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు. ఏది ఏమైనా నాని ఈసారి ఒక డిఫరెంట్ కథ తో వచ్చి సక్సెస్ అందుకుంటారని ఆయన అభిమానులు ఆశిస్తున్నారు.

Share.