‘వీర భోగ వసంత రాయలు’ ఫస్ట్ లుక్

Google+ Pinterest LinkedIn Tumblr +

టాలీవుడ్ సీనియర్ నటి శ్రియ శరన్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘వీర భోగ వసంత రాయలు’.శ్రియ ఈ సినిమాలో ఎయిర్ హోస్టెస్ గా నటించిందని సమాచారం. ఈ చిత్రానికి ఇంద్రసేనా దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. నారా రోహిత్, సుధీర్ బాబు, శ్రీ విష్ణు ఈ చిత్రంలో హీరోలుగా నటించారు. గతంలో చిత్ర దర్శకుడు ఈ సినిమా ఫస్ట్ లుక్ ని విడుదల చేసినప్పుడు సినీ ప్రేక్షకులలో ఈ మూవీ పై ఆసక్తి నెలకొంది. ఫస్ట్ లుక్ ద్వారా ఈ చిత్రం ఒక క్రైమ్ థ్రిల్లర్ కథాంశం తో నడవనుందని అర్ధం అవుతుంది.
ఇక ఈ రోజు చిత్ర యూనిట్ వారు ఈ సినిమాలో శ్రియ లుక్ ని విడుదల చేసారు. అందులో శ్రియ చిన్న హెయిర్ కట్ తో దర్శనమిచ్చి ప్రేక్షకులని ఆశ్చర్య పరిచింది. గతంలో శ్రియ విక్రమ్ హీరోగా నటించిన మల్లన్న చిత్రం లో ఇదే విధమైన లుక్ లో కనిపించింది. ఈ చిత్రాన్ని వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే ఆలోచనలో చిత్ర బృందం ఉందని సమాచారం.

Share.