‘పేపర్ బాయ్’ అఫిషియల్ టీజర్

Google+ Pinterest LinkedIn Tumblr +

నూతన నటీనటులు సంతోష్ శోభన్, రియా సుమన్,తాన్యా హోప్ నటించిన చిత్రం ‘పేపర్ బాయ్’ టీజర్ ఈ రోజు ఉదయం చిత్ర యూనిట్ సభ్యులు అధికారికంగా విడుదల చేసారు. ప్రముఖ దర్శకుడు ‘సంపత్ నంది’ ఈ చిత్రాన్ని తన సొంత నిర్మాణ సంస్థ ‘సంపత్ నంది టీం వర్క్స్’ లో నిర్మించారు. సంపత్ నంది తొలి సారిగా నిర్మిస్తున్న సినిమా కావటం తో టాలీవుడ్ లో ఈ సినిమా పై బారి అంచనాలు నెలకొన్నాయి. జయ శంకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా భీమ్స్ స్వరాలూ సమకూర్చారు. ప్రస్తుతం ఈ సినిమా లో కీలకమైన సన్నివేశాలని హైదరాబాద్ శివార్లలో చిత్రీకరిస్తున్నారు. రెండు పాటల మినహా మిగిలిన సినిమా షూటింగ్ పూర్తయిందని సమాచారం.

ఇక ఈ రోజు విడుదలైన సినిమా టీజర్ ని బట్టి ఇది ఒక రొమాంటిక్ లవ్ స్టోరీ అని తెలుస్తుంది. చిత్ర బృందం వారు ఈ సినిమాని వచ్చే నెల విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు.

Share.