మాజీ దేశ ప్రధాని శ్రీ అటల్ బిహారి వాజ్ పేయి కొన్ని రోజుల క్రితం మరణించిన విషయం తెలిసిందే. అయితే జీవితాంతం బ్రహ్మచారి గానే ఉన్న వాజ్ పేయి గురించి ఇపుడు ఒక ఆసక్తికరమైన వార్త ఒకటి బయటకు వచ్చింది. వాజ్ పేయి ప్రముఖ బాలీవుడ్ నటి, డ్రీం గర్ల్ హేమ మాలిని కి వీరాభిమాని అని ఒక ఇంటర్వ్యూ లో హేమ మాలిని కొద్దీ రోజుల క్రితం తెలిపింది. సుమారు 46 సంవత్సరాల క్రితం 1972 లో విదుదలైన హేమ మాలిని చిత్రం ‘ సీత ఔర్ గీత’ చిత్రాన్ని వాజ్ పేయి సుమారు 25 సార్లు చూశారట. ఈ విషయాన్నీ మరో సీనియర్ బీ జె పీ నాయకురాలు హేమ మాలిని కి చెప్పారని సమాచారం.
గతంలో హేమ మాలిని పార్టీ లీడర్ గా ఉన్న సమయంలో అటల్ బిహారి వాజ్ పేయి గారిని కలవటానికి అయన నివాసానికి వచ్చారు, అది తెలుసుకున్న వాజ్ పేయి ఆమెతో మాట్లాడటానికి కొంచం ఆలోచించారని అటు తరువాత వచ్చి ఆమెని కలిసి మాట్లాడారట, ఇలా వాజ్ పేయి హేమ మాలిని ని కలవటానికి ఎందుకు కొంచం సిగ్గు పడ్డారని హేమ మాలిని అక్కడున్న ఒక సీనియర్ మహిళా నాయకురాలిని అడిగిందట అప్పుడు ఆమె వాజ్ పేయి గారు మీకు పెద్ద అభిమాని అని, మీ సినిమా ‘ సీత ఔర్ గీత ‘ చిత్రాన్ని కేవలం మీ కోసం 25 సార్లు చూసారని ఆమె చెప్పటంతో హేమ మాలిని ఆశ్చర్య పోయారట. వాజపేయి గురించి ఎవరికీ తెలియని ఈ నిజం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.