అలా వస్తే నో ఎంట్రీ

Google+ Pinterest LinkedIn Tumblr +

ప్రస్తుతం సోషల్ మీడియా లో బాగా సర్కులేట్ అవుతున్న టాపిక్ ఏదైనా ఉందంటే అది దీపికా, రణ్ వీర్ పెళ్లి విషయమే. గతంలో వీరి పెళ్లి ఈ సంవత్సరం శ్రావణ మాసంలో జరగనుందని బాలీవుడ్ మీడియా లో అనేక కథనాలు ప్రచురించారు, అయితే అవన్నీ వట్టి కల్పితం అని తెలిసిపోయింది. ఇక ఇప్పుడు తాజాగా వీరి పెళ్లి వేడుక ఈ సంవత్సరం నవంబర్ 20 న ఇటలీ లో జరగనుందని నేషనల్ మీడియా లో కొన్ని వార్తలు వెలువడ్డాయి. వీరిది డెస్టినేషన్ వెడ్డింగ్ అని ఇప్పటికే తెలుస్తుంది, దీని పై దీపికా రణ్ వీర్ నుండి అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది.

అయితే ఈ పెళ్లికి వచ్చే అతిథులు వారి సెల్ ఫోన్స్ ని తీసుకురాకూడదు అనే ఒక నిబంధన విధించారట నిర్వాహకులు. ఆ విధంగా వస్తే పెళ్లి కి నో ఎంట్రీ అని చెప్పారట ఈ పెళ్లిని ఆర్గనైజ్ చేసే వారు. అసలే బాలీవుడ్ లో మోస్ట్ హ్యాపెనింగ్ వెడ్డింగ్ మరి అటువంటి వేడుకని ఎవరికైనా తమ సెల్ ఫోన్స్ లో చిత్రీకరించాలని ఉంటుంది. ఇలా చిత్రీకరించి వాటిని సోషల్ మీడియా లో రిలీజ్ చేస్తున్న అనేక మందికి ఈ వార్త చేదుగానే అనిపించవచ్చు.

Share.