ఉప్పెన సినిమాని వదులుకున్న శివాని రాజశేఖర్..!!

Google+ Pinterest LinkedIn Tumblr +

టాలీవుడ్ ఇండస్ట్రీలో సెన్సేషన్ సృష్టించిన సినిమా ఉప్పెన.. ఈ సినిమాని కొత్త హీరో హీరోయిన్లతో తీసిన కూడా మంచి సక్సెస్ ను అందుకున్నారు డైరెక్టర్ బుచ్చిబాబు..అలాగే ఈ సినిమాకి బడ్జెట్ తక్కువే పాపులారిటీని ఎక్కువగా సంపాదించుకుంది. ఈ సినిమా ఏకంగా 100 కోట్ల కలెక్షన్ ను రాబట్టి సరికొత్త రికార్డును సృష్టించింది .ఇప్పటికీ కూడా ఈ సినిమాలో పాటలు ట్రెండింగ్ గానే ఉన్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే ఉప్పెన హీరోయిన్ కృతి శెట్టి ఓవర్ నైట్ లోనే స్టార్ హీరోయిన్గా మారిపోయి.. అరడజన్ అవకాశాలను దక్కించుకొని బిజీ స్టార్ హీరోయిన్గా మారిపోయింది.

Shivani Rajasekhar: ఉప్పెన నేను చేయాల్సింది.. ఆ సీన్లు ఉన్నాయ‌ని! |  Initially Shivani Rajasekhar Is Female lead In Uppena SRK

అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చి సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారుతోంది. శివాని రాజశేఖర్ ఈ పేరుని ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు ఇప్పుడిప్పుడే తెలుగు తమిళ సినిమాల్లో నటిస్తూ మంచి పేరు తెచ్చుకుంది శివాని అయితే ఈ మధ్యనే విడుదలైన కోటబొమ్మాలి పిఎస్ లో ఓ ప్రధాన పాత్రలో నటించి మంచి మార్కులు కొట్టేసింది ఈ అమ్మడు. అయితే ఈ సందర్భంగా శివాని ఓ మీడియాతో మాట్లాడుతూ కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది.

ఉప్పెన సినిమాలో మొదటగా నన్నే హీరోయిన్ గా సెలెక్ట్ చేసుకున్నారని కానీ నాకు వినిపించిన స్క్రిప్ట్ లో ఇంటిమేట్ బోల్డ్ సన్నివేశాలు ఎక్కువగా ఉండటంతో నేను ఈ సినిమాకి నో చెప్పానని తీరా ఆ సినిమా విడుదలయ్యాక చూస్తే నాకు చెప్పిన కథ వేరు ఆ సినిమాలో ఉన్న కథ వేరు ఆ సినిమాలో చాలా మార్పులు చేశారని చెప్పుకొచ్చింది. ఆ ఫైనల్ వర్షన్ తనకు చెబితే నేను చేసే దానినేమోనని..మంచి అవకాశాన్ని మిస్ చేసుకున్నాను అంటూ శివాని ఈ సందర్భంలో బాధపడింది.

మరి రాబోయే రోజుల్లో శివాని రాజశేఖర్ మరిన్ని చిత్రాలలో నటించాలని అభిమానుల సైతం కోరుకుంటున్నారు. ఎలాంటి పాత్రలోనైనా సరే ఒదిగిపోయి మరి నటిస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ.

Share.