చైతు చేసిన పనికి సమంత సమాధానం చెప్పాల్సిందే: మహేష్ ఫ్యాన్స్

Google+ Pinterest LinkedIn Tumblr +

నటి సమంత తాజాగా నటించిన చిత్రం ‘ యూ టర్న్ ‘ విడుదలకు సిద్ధంగా ఉంది. మరో వైపు నాగ చైతన్య సినిమా ‘ శైలజ రెడ్డి అల్లుడు ‘ కూడా సెప్టెంబర్ 13 వ తేదీనే విడుదల కానుంది. అయితే గతంలో సమంత, మహేష్ బాబు ‘ 1 ‘ నేనొక్కడినే సినిమా విడుదల సమయంలో రిలీజ్ చేసిన ఒక పోస్టర్ పై అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

మహేష్‌ నడుస్తోంటే వెనుక నుండి కృతి సనాన్ కుక్క పిల్ల లాగా పాకుతూ కనిపిస్తుంది ఆ పోస్టర్ లో..ఇది చూసిన సమంత ” రిగ్రెస్సివ్ ” అంటూ కామెంట్ చేసింది. అప్పట్లో సమంత కామెంట్ పై మహేష్ ఫ్యాన్స్ తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. ఇదే విషయం పై మహేష్ ని అడగ్గా పోస్టర్ నచ్చకపోతే తనకే ఫోన్ చేసి చెప్పవచ్చు అని తెలిపారు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అనుకుంటున్నారా..ఆగండి అక్కడికే వస్తునాం. తాజాగా చైతు, అను ఇమ్మాన్యుయేల్ జంటగా నటించిన శైలజ రెడ్డి అల్లుడు సినిమాలో ఒక సాంగ్ లో చైతు పాదాలని అను ముద్దాడుతూ కనిపించింది. ఇది గమనించిన మహేష్ ఫ్యాన్స్ అప్పుడు నేనొక్కడినే పోస్టర్ రిగ్రెస్సివ్ అయితే మరి ఇదేంటని సమంతని ప్రశ్నించారు.

అయితే ఇప్పటి వరకు సమంత ఈ వివాదం పై ఎటువంటి వివరణ ఇవ్వలేదు. సమంత ఇలాగె మౌనంగా ఉంటె ఆమెని మహేష్ ఫ్యాన్స్ వదిలేలా లేరు, చూద్దాం ఆమె ఏ విధంగా స్పందిస్తుందో.

Share.