క్రేజీ హీరోయిన్ తో బెల్లంకొండ

Google+ Pinterest LinkedIn Tumblr +

‘అల్లుడు శ్రీను’ చిత్రంతో టాలీవుడ్‌లో హీరోగా ఎంట్రీ ఇచ్చిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్, ఆ తరువాత వరుసబెట్టి సినిమాలు చేస్తూ వస్తున్నాడు. అయితే మనోడు చేసే సినిమాలు ఒక రేంజి బడ్జెట్‌తో తెరకెక్కినా.. అవి బాక్సాఫీస్ వద్ద మాత్రం బిచానా ఎత్తేస్తూ వస్తున్నాయి. దీంతో ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో మనోడు సినిమాను సెలెక్ట్ చేసుకున్నాడు.

RX100 సినిమాతో టాలీవుడ్‌లో రికార్డులు క్రియేట్ చేసిన డైరెక్టర్ అజయ్ భూపతి తన నెక్ట్స్ మూవీలో హీరోగా బెల్లంకొండ బాబును సెలెక్ట్ చేసుకున్నాడు. కాగా ఈ సినిమాలో హీరోయిన్‌గా మరోసారి సమంతను సెలెక్ట్ చేయాలని బెల్లంకొండ హీరో చిత్ర యూనిట్‌కు తెలిపినట్లు టాక్ వినిపిస్తోంది. తనకు మొదటి సినిమాతో హిట్ అందించిన సమంత అయితే ఈ సినిమా కూడా హిట్ అవుతుందని.. తనకు సెంటిమెంట్ బాగా కలిసొస్తుందని హీరో అన్నాడట.

హీరో కోరిక మేరకు చిత్ర యూనిట్ కూడా సమంతతో చర్చలు జరుపుతున్నారట. ఒకవేళ సమంత ఈ సినిమాకు పచ్చ జెండా ఊపితే బెల్లంకొండ హీరో ఎదురుచూస్తున్న హిట్ దక్కినట్లే అనుకోవచ్చు. మరి సమంత నో చెబితే మనోడి పరిస్థితి ఏమిటీ.. హీరోయిన్‌గా ఎవరిని సెలెక్ట్ చేస్తాడు అనే టాపిక్ ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

Share.