ఓ బేబీ సినిమా ఇచ్చిన విజయంతో సమంత పేరు ఇప్పుడు టాలీవుడ్లో మార్మోగిపోతుంది. సమంత వరుస హిట్లతో టాలీవుడ్లో దూసుకుపోతున్న తరుణంలో ఇప్పుడు సమంత చూపు బుల్లితెరపై పడిందనే సమాచారం వినిపిస్తుంది. బుల్లితెరలో వచ్చే వెబ్ సిరిస్ సినిమాల్లో నటించాలనే కోరిక ఉన్నట్లు సమంత మాటలతో అర్థమవుతుంది.
ఇప్పుడు సిల్వర్స్క్రీన్పై జనాలకు మొహమెత్తిందనే విషయం తెలిసిపోతుంది. ఎందుకంటే ఆనాడు సినిమాలు శతదినోత్సవం, ద్విశత దినోత్సవంతో పాటుగా ఏడాదికేడాదిగా నడిచి హిట్ సాధించిన సినిమాలు ఎన్నో. శతదినోత్సవం ఆడిందంటే ఆ సినిమాకు తిరుగులేనిదన్నమాట. ఇక అంతకన్నా ఎక్కువ రోజులు నడిస్తే అది బ్లాక్బస్టరే అన్నమాట. కానీ రోజులు మారాయి. సినిమాలు చేసేవారు తగ్గారు. కారణం లేకపోలేదు… బుల్లితెర రావడంతో ఇక జనాలు థియోటర్లకు వెళ్ళడం తగ్గిపోయింది.
అదే ఇప్పుడు సినిమాలు కేవలం వారం రోజులు, రెండు వారాలు, నెల రోజులు అనే రోజులు వచ్చాయి. ఇప్పుడు ఎంత బడ్జెట్ పెట్టాము.. ఆ బడ్జెట్ వచ్చిందా సరే లేదంటే అది ప్లాప్ కింద లెక్క. బడ్జెట్కన్నా ఎక్కువ వచ్చిందంటే అది హిట్. ఇక వంద కొట్లు దాటిందంటే అదొక హిట్. ఇలా సినిమాలు రాబడిపై విజయాలును లెక్కబెడుతున్నారు. అయితే దీంతో సినిమాల మాటను పక్కనబెట్టి బుల్లితెరపై వెబ్ సిరిస్ సినిమాలకు కాలం వచ్చింది. ఈ వెబ్ సిరిస్లు హాలీవుడ్,బాలీవుడ్లో ఎక్కువగా వస్తున్నాయి. ఇప్పుడు వీటిపై సమంత కన్నేసిందంట.సో త్వరలో సమంత ఒక వెబ్ సిరీస్ లో నటించనుందని టాలీవుడ్ లో వార్త హాల్ చల్ చేస్తుంది.