సమంత విడాకుల ట్రోలర్స్ పై గట్టి కౌంటర్ ఇచ్చిన ప్రముఖ నటి.!

Google+ Pinterest LinkedIn Tumblr +

తాజాగా స్టార్ హీరో సూర్య కథానాయకుడిగా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన సూర్య సన్నాఫ్ కృష్ణన్ సినిమా హీరోయిన్లలో ఒకరిగా నటించిన దివ్య స్పందన కన్నడ సినీ రంగంలో బాగా పాపులర్ అయిన తారలలో ఈమె కూడా ఒకరు. కర్ణాటకలో భారీ ఫాలోయింగ్ ఉన్న టాప్ హీరోయిన్ కూడా కావడం గమనార్హం.కొన్ని భారీ బ్లాక్ బాస్టర్ సినిమాలలో నటించిన దివ్య స్పందన ఆ తర్వాత రాజకీయాలలోకి ప్రవేశించి కొంతకాలం పాటు ఎంపీగా కొనసాగింది. సోషల్ మీడియాలో అభిమానులతో నిరంతరం టచ్ లో ఉండే ఈమె తాజాగా సదరు హీరోయిన్ కం పొలిటిషన్ అయిన దివ్య తన సోషల్ మీడియాలో మహిళల గురించి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

ప్రతి అంశంలో కూడా ఆడవారిని హైలెట్ చేస్తూ చూపించడానికి ప్రపంచం ఎలా ఆరాటపడుతుందో పలువురు నటీమణుల విషయంలో జరిగిన ఉదంతాలను చూస్తే అర్థమవుతుంది అంటూ స్పష్టం చేసింది. విడాకులు విషయంలో సమంతను దారుణంగా ట్రోల్ చేశారు.. రష్మిక కెరియర్ కోసం తన ప్రేమికుడి నుంచి విడిపోవడం పైన కూడా నెటిజెన్లు అంతే దారుణంగా ట్రోలింగ్ చేశారు. అంతే కాదు సాయి పల్లవిని కూడా తీవ్రంగా సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు అంటూ దివ్య స్పందన తన రాతల్లో ఈ విధంగా పేర్కొంది. అలాగే షారుక్ ఖాన్, దీపికా పదుకొనే నటిస్తున్న పఠాన్ సినిమాలో కూడా ఇటీవల విడుదలైన ఒక పాటలో దీపిక కాషాయపు రంగు బికినీ ధరించడం పై కూడా విమర్శలు సృష్టిస్తున్నారు.

దేనినైనా ఎంపిక చేసుకునే స్వేచ్ఛ ప్రాథమిక హక్కు.. స్త్రీలు దుర్గామాత స్వరూపం.. స్త్రీ ద్వేషానికి వ్యతిరేకంగా మనమందరం పోరాడాలని దివ్య తన ట్వీట్ ద్వారా కోరారు. ప్రస్తుతం దివ్య స్పందన చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంతేకాదు ఈమె చెప్పిన విషయం కూడా ఆలోచించదగినదే.. కాబట్టి ప్రతి ఒక్కరు ఈమెకు మద్దతు పలుకుతున్నారు. కనీసం తప్పొప్పులు తెలుసుకొని ట్రోల్ చేస్తే బాగుంటుందని ఎటువంటి తప్పులు చేయని ఆడవారిని ఎందుకు ఇలా దూషిస్తున్నారు అని మరి కొంతమంది కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.

Share.