పవర్ స్టార్ ని ఫాలో అవుతున్న సమంత

Google+ Pinterest LinkedIn Tumblr +
కన్నడలో సూపర్ హిట్ అయిన యూటర్న్ మూవీని తెలుగులో సమంత ఇష్టపడి మరి రీమేక్ చేసింది. సెప్టెంబర్ 13న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా స్పెషల్ గా అనిరుధ్ తో ఓ స్పెషల్ సాంగ్ ప్లాన్ చేశారు. ఈ రోజు రిలీజ్ చేసిన ఈ సాంగ్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. అజ్ఞాతవాసి సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన మ్యుజిషియన్ అనిరుధ్ రవిచంద్రన్. ఆ సినిమాతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చినా సరే అతనికి లక్ కలిసి రాలేదు. గతంలో పవన్ అజ్ఞాతవాసి చిత్రానికి కూడా అనిరుద్ ఇదే విధంగా రిలీజ్ కి ముందే ఒక వీడియో సాంగ్ విడుదల చేసారు. ఇప్పుడు సమంత కూడా ఇదే విధంగా రిలీజ్ కి ముందే ఒక వీడియో సాంగ్ లో నటించి ముందే విడుదల చేసారు. చూద్దాం సమంత ఈ విధంగా పవర్ స్టార్ ని ఫాలో అవుతుండటం సినిమా సక్సెస్ కి ఎంత వరకు కలిసి వస్తుందో.

అయితే ఈసారి అజ్ఞాతవాసి తర్వాత యూటర్న్ మూవీకి ప్రమోట్ చేస్తున్నాడు. అజ్ఞాతవాసి తర్వాత అనిరుధ్ ఎన్.టి.ఆర్, త్రివిక్రం సినిమాకు అనుకున్నా ఆ సినిమా ప్రభావం వల్ల అతన్ని మార్చాల్సి వచ్చింది. మొత్తానికి అనిరుధ్ మాత్రం తెలుగులో వచ్చిన ప్రతి అవకాశం వాడుకునేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఇక నిన్న పవన్ పుట్టిన రోజు సందర్భంగా సమంత తన ట్విట్టర్ ద్వారా విషెస్ చబుతూ ” హ్యాపీ బర్త్ డే పవర్ స్టార్, మీరు ఈ జనరేషన్ కి ఒక రోల్ మోడల్, నిస్వార్థమైన ప్రేమకి మీరు ఒక ఉదాహరణ ” అని తెలిపారు.

 

Share.