నాచురల్ స్టార్ హీరో నాని.. సాయి పల్లవి కాంబినేషన్ లో వచ్చిన మొదటి సినిమా మిడిల్ క్లాస్ అబ్బాయి. ఇక ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన మరొక సినిమా శ్యామ్ సింగారాయ్.. కాకపోతే పుష్ప పార్ట్ వన్ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో ఈ సినిమాకు ప్లస్ పాయింట్ అవుతోంది. డిసెంబర్ 24వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో కచ్చితంగా సక్సెస్ సాధిస్తుందని అభిమానులు నమ్ముతున్నారు. నాని కూడా ఈ సినిమా విషయంలో కాన్ఫిడెన్స్ తో ఉన్నారు.
ఇకపోతే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నాని మాట్లాడుతూ..ఎంసీఏ మూవీతో సాయిపల్లవి మంచి ఫ్రెండ్ అయిందని.. సాయిపల్లవి ఇంట్లో మనిషిలా కలివిడిగా ఉంటుందని నాని పేర్కొన్నారు. సినిమాలోని మైథిలి రోల్ కు ఆమె మాత్రమే న్యాయం చేస్తుందని భావించానని నాని చెప్పుకొచ్చారు. సినిమా షూటింగ్ ఎంతో సరదాగా సాగిందని.. సాయిపల్లవి ఈ సినిమాలో నటిస్తుందని ముందే ఊహించానని నాని పేర్కొన్నారు. ఉప్పెన పోస్టర్లను చూసి ఈ సినిమాలో మరో పాత్ర కోసం కృతిశెట్టిని సంప్రదించామని కీర్తి పాత్రకు కృతి న్యాయం చేసిందని నాని వెల్లడించారు.