క్షమాపణలు చెప్పిన రజినీకాంత్..కారణం ఇదేనా..!

Google+ Pinterest LinkedIn Tumblr +

కొందరు నటీనటులు ఎంత స్టార్ డమ్ సంపాదించుకున్న అప్పటికీ వారి అభిమానులతో ప్రేక్షకులకు ఎప్పుడు సన్నిహితంగానే ఉంటారు. ఎంత స్టార్ హీరో అన్న విషయాన్ని పక్కన పెట్టి మరీ అభిమానులకు దగ్గరవుతూ ఉంటారు. అలాంటి హీరోలలో సూపర్స్టార్ రజనీకాంత్ కూడా ఒకరు. ఎంతో కష్టపడి సొంతంగా తన స్టార్ హీరో స్టేటస్ ను సంపాదించుకున్న ప్పటికీ.. ఆయన ఎప్పుడూ అభిమానులను సంతోష పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటారు.

తాజాగా ఒక అభిమాని కోసం రజనీ చేసిన పని నెటిజన్లకు షాక్ కు గురి చేస్తోంది. తెలుగు తమిళంలో ఎంతోమంది పెద్ద స్టార్లు అభిమానుల ఆరోగ్యం బాగా లేకపోతే నేరుగా కలవడం.. వారితో మాట్లాడడం వంటివి చేస్తూ ఉంటారు. అలా చేసిన ప్రతిసారీ వారిపై అభిమానం మరింత పెరిగిపోతూ ఉంటుంది. అయితే రజనీకాంత్ అభిమాని ఒకరు అనారోగ్యంతో బాధ పడుతున్నారు అని తెలిసి రజినీకాంత్ వీడియో సందేశాన్ని మాత్రమే పంపారు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ గా అవుతోంది.

ఇక కరోనా పరిస్థితుల వల్ల నాకు కూడా ఆరోగ్యం బాగా లేకపోవడంతో మిమ్మల్ని నేరుగా కలవలేక పోతున్నాను క్షమించండి అంటూ వేడుకొన్నాడు రజనీకాంత్.

Share.