బంగార్రాజు మూవీ నుంచి.. మరో లిరికల్ వీడియో..!

Google+ Pinterest LinkedIn Tumblr +

అక్కినేని నాగార్జున, నాగ చైతన్య, కృతి శెట్టి, రమ్యకృష్ణ ప్రధాన పాత్రలలో కలిసి నటిస్తున్న తాజా చిత్రం బంగార్రాజు. సినిమాకి డైరెక్టర్ గా కళ్యాణ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ సినిమాని జి స్టూడియోస్, అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా సోగ్గాడే చిన్ని నాయన కి సీక్వెల్ గా తెరకెక్కించబడుతోంది. ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, వీడియోలు ఇప్పటికే ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి.

తాజాగా ఈ చిత్రం నుండి వాసివాడి తస్సాదియ్యా లిరికల్ వీడియో ను చిత్ర యూనిట్ సభ్యులు విడుదల చేయడం జరిగింది. ఇక ఈ పాట కి ప్రేక్షకుల నుండి అభిమానుల నుండి మంచి విశేష స్పందన లభిస్తోంది. ఇక ఇందులో రావు రమేష్, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్, ఝాన్సీ, అనితా చౌదరి, తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సభ్యులు సన్నాహాలు చేస్తున్నారు. ఏది ఏమైనా ఈ సినిమా పక్కాగా హిట్టవుతుందనే నమ్మకం అక్కినేని అభిమానులలో ఉంది.

Share.