టాలీవుడ్ లో నాని నటించిన ‘కృష్ణగాడి వీర ప్రేమగాధ’సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయిన మెహ్రీన్ వరుసగా విజయవంతమైన సినిమాల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకుంది. ఇటీవల రిలీజ్ అయిన ఎఫ్ 2 సినిమాలో మెహ్రీన్ ఫన్నీనటనలకు విమర్శకుల నుంచి ప్రశంసంలు అందుకుంది. అలాంటి బ్యూటీని మెగా హీరో వద్దు అంటున్నట్లు ఫిలిమ్ వర్గాల్లో టాక్ నడుస్తుంది.
మారుతి దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్ ఓ సినిమాలో నటించబోతున్నారు. ఈ సినిమా కథా పరంగా చూస్తే మెహ్రీన్ బాగా సెట్ అవుతుందని ఆమెను హీరోయిన్ గా తీసుకుందామని మారుతి అనగా..సాయితేజ్ మాత్రం వద్దని సున్నితంగా చెప్పినట్లు టాలీవుడ్ టాక్. మెహ్రీన్ కి సాయి తేజ్ కి ఉన్న సమస్య ఏంటనేది మాత్రం తెలియడం లేదు.
ఆ మద్య ‘జవాన్’ సినిమాలో నటించారు. ఆ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది.దాంతో మారుతి బాలీవుడ్ బ్యూటీ రుక్సార్ ని రంగంలోకి దింపారు. ఈమె ‘కృష్ణార్జున యుద్ధం’, ‘ఏబిసిడి’ వంటి చిత్రాల్లో నటించింది. ఈ మూవీని అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు.