తన సహజమైన నటనతో అందరి దృష్టి ఆకర్షించి… అతి తక్కువ సమయంలోనే ఫిలిం ఇండ్రస్ట్రీలో టాప్ రేంజ్ హీరోయిన్ ఇమేజ్ సంపాదించుకున్న ‘ఫిదా’ మూవీ హీరోయిన్ సాయి పల్లవి గురించి ఎంత చెప్పుకున్నా … తక్కువే. ఎందుకంటే ఆమె నటనకు ఎవరైనా ఫిదా అయిపోవాల్సిందే. అందుకే ఆమెకు ఫిల్మ్ ఇండ్రస్ట్రీలో అంత క్రేజ్.
ఆమె నటించిన … ఫిదా, ఎంసిఎ, పడి పడి లేచే మనసు మూవీలలో ఆమె ఫెరఫామెన్స్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఆమె ప్రస్తుతం తమిళంలో రెండు సినిమాల్లో నటిస్తోంది. ఒక సినిమాలో ఆమె తెలుగు తమిళ టాప్ హీరో సూర్యతో నటిస్తుండగా… ఇక తెలుగులో ఆమె బాహుబలి విలన్ రానా దగ్గుపాటితో కలిసి ఓ సినిమా చేసేందుకు సిద్ధం అయ్యినట్టు సమాచారం. ఈ సినిమాకి శ్రీవిష్ణుతో నీది నాది ఒకే కథ మూవీతో రచయిత నుంచి దర్శకుడిగా మారిన వేణు ఉడుగుల డైరెక్టర్ అని సమాచారం.
ఈ సినిమాలోని కథ నక్సల్స్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్నట్టు ఫిల్మ్ నగర్ టాక్. ఈ సినిమాలో సాయి పల్లవి నక్సలైట్ గా కనిపించబోతున్నట్టు వస్తున్న వార్తలు అందరిలోనూ ఉత్కంఠ రేపుతున్నాయి. అయితే… ఇప్పటికే ఈ సినిమాకు విరాటపర్వం 1992 టైటిల్ ను ఫిక్స్ చేశారట. ఇక ఈ సినిమాలో రానా పోలీస్ పాత్రలో నక్సలైట్ లను వేటాడే పాత్ర చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ వచ్చే నెలలో ప్రారంభం అయ్యే అవకాశం కనిపిస్తోంది.