సాహోలో సెన్సేషనల్ కాన్సెప్ట్ లీక్ అయ్యింది..!

Google+ Pinterest LinkedIn Tumblr +

యంగ్ రెబల్ స్టార్ హీరోగా యువ దర్శకుడు సుజిత్ డైరక్షన్ లో వస్తున్న సినిమా సాహో. యువి క్రియేషన్స్ బ్యానర్ లో వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్న ఈ సినిమా 200 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. బాహుబలి సినిమాతో నేషనల్ వైడ్ గా ఫాలోయింగ్ ఏర్పరచుకున్న ప్రభాస్ సాహోతో మరోసారి అదే రేంజ్ హిట్ కొట్టాలని చూస్తున్నాడు. ఇక ఈ సినిమా మేకింగ్ వీడియో మొన్నమాధ్య రిలీజై సెన్సేషనల్ గా నిలవగా ఇప్పుడు సినిమా నుండి మరో సీన్ గురించి న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

సినిమాలో ప్రభాస్ దొంగగా కనిపిస్తున్నాడు. ఓపెనింగ్ సీన్ లోనే భారీ రాబరీ చేస్తాడట. ఆ సీన్ ధూం సీరీస్ లలో కూడా లేని విధంగా అదిరిపోతుందట. హాలీవుడ్ సినిమా తరహాలో ఈ ఛేజ్ సీన్ ఉంటుందట. తప్పకుండా ఫ్యాన్స్ కు ఇది సర్ ప్రైజ్ ఇవ్వడం గ్యారెంటీ అంటున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రద్ధా కపూర్ నటిస్తుంది. సినిమాకు శంకర్ ఎహసన్ లాయ్ మ్యూజిక్ అందిస్తున్నారు.

ఆగష్టు 15న ఈ సినిమా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. అయితే అదే రోజు మెగాస్టార్ చిరంజీవి సైరా నరసింహా రెడ్డి సినిమా వస్తుందని అంటున్నారు. మరి ఈ బిగ్ ఫైట్ ప్రభాస్, చిరులలో ఎవరి సత్తా చూపిస్తారు అనంది వేచి చూడాలి. అసలైతే సంక్రాంతికి సాహో రిలీజ్ కావాల్సి ఉన్నా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఇంకాస్త టైం పట్టేలా ఉందని ఆగష్టులో రిలీజ్ ఫిక్స్ చేశారు. ఈ సినిమా మీద అటు తెలుగులోనే కాదు బాలీవుడ్ మీడియాలో కూడా చర్చ మొదలైంది.

Share.