టాలీవుడ్ లో ఒక ట్రెండ్ ఎప్పటి నుండో నడుస్తూ ఉంది. అదేంటంటే ఒక కొత్త హీరోయిన్ మన తెలుగు సినిమాతో పరిచయం అయితే తన తొలి చిత్రం హిట్ సాధించి అందులో తన పాత్రకి మంచి గుర్తింపు వస్తే ఇక అటువంటి పాత్రలే సదరు నటీమణులకు ఆఫర్ చేయటం గత కొంత కాలంగా తెలుగు చిత్ర పరిశ్రమలో ఎక్కువైంది. గతంలో నటి సాయి పల్లవి ఫిదా సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే అటు తరువాత తనకి అదే తరహా పాత్రలు రావటం జరిగింది. ఇక తాజాగా టాలీవుడ్ సెన్సేషన్ ఆర్ ఎక్స్ ఫేమ్ పాయల్ రాజ్ ఫుట్ తన మొదటి చిత్రంతోనే కుర్రకారుని తన అందచందాలతో మాయ చేసింది. బోల్డ్ లిప్ లాక్ సన్నివేశాలలో ఈ అమ్మడు చాల చక్కగా నటించింది. తరువాత పాయల్ కి అటువంటి బోల్డ్ ఆఫర్స్ వచ్చిన వాటిని తిరస్కరించింది.
ఇక ఇప్పుడు రీసెంట్ గా విడుదలైన ‘ చి ల సౌ ‘ నటి రుహాణి శర్మ కూడా తన తొలి చిత్రంలో చాల అందంగా పద్దతిగా నటించింది. ఇది ఒక కుటుంబ కథ చిత్రం కావటంతో రుహానికి ఈ సినిమాలో తగినంత గా ఎక్సపోసింగ్ చేయాల్సిన అవసరం రాలేదు. ఇప్పుడు రుహానికి వరుసగా ఇటువంటి డీసెంట్ రోల్స్ రావటం మొదలయ్యాయట, అయితే ఇటువంటి రోల్స్ చేస్తే ఎక్కువ కాలం ఇండస్ట్రీ లో కొనసాగలేము అని గ్రహించిన రుహాణి నేను అలంటి రోల్స్ ఇకపై అంతగా చేయనని నేను అసలు ఆ టైపు అమ్మాయినే కాదని మీడియా ఎదుట చెప్పిందట. ఆమె సమాధానంతో అక్కడ ఉన్న వారంతా ఆశ్చర్య పోయారట. అంతే కాకుండా తాను గ్లామరస్ రోల్స్ కి కూడా సిద్ధం అని చెబుతూ అందుకు తగినవిధంగా తన బోల్డ్ ఫోటోలని సోషల్ మీడియా లో షేర్ చేస్తూ ఫ్యాన్స్ ని ఆకర్షిస్తుంది ఈ వయ్యారి.